
దేశంలోని సీనియర్ సిటిజన్ల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. వారి కోసం ప్రత్యేకంగా కొన్ని స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. బస్సులు, రైళ్లల్లో టికెట్లపై రాయితీలతో పాటు పలు పెన్షన్ పథకాలు కేంద్రం తీసుకొచ్చింది. దేశంలో 60 ఏళ్లు నిండినవారికి సీనియర్ సిటిజన్లుగా భావిస్తారు. వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాయి. బస్సుల్లో ప్రత్యేక సీట్లతో పాటు రైళ్లల్లో లోయర్ బెర్త్‌లు కేటాయించడం లాంటివి అమల్లో ఉన్నాయి. అయితే ఇలాంటి ప్రయోజనాలు పొందాలంటే సీనియర్ సిటిజన్ల కార్డు అనేది అవసరం. ఈ కార్డు ఉంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా సీనియర్ సిటిజన్లుగా గుర్తిస్తాయి. ఈ కార్డు ఎలా పొందాలి? రుసుం ఎంత? ఇంటి నుంచే ఆన్‌లైన్ ద్వారా పొందవచ్చా? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ పత్రాలు తప్పనిసరి
సీనియర్ సిటిజన్ కార్డు పొందాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అనేవి అసవరం. వీటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. వయస్సు ధృవీకరణ కోసం ఆధార్, పాన్, పాస్ పోర్ట్, ఓటర్ గుర్తింపు కార్డు, పదో తరగతి సర్టిఫికేట్‌లలో ఏదైనా అప్‌లోడ్ చేయాలి. ఇక అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్, పవర్ బిల్లు, రేషన్ కార్డు, పాస్ పోర్ట్, ఓటర్ ఐడీలలో ఏదైనా ఒకటి అవసరం. ఇక పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు, మొబైల్ నెంబర్ కలిగి ఉండాలి.
సీనియర్ సిటిజన్ కార్డు పొందటం ఎలా..?
-రాష్ట్రాల ఈ-జిల్లా పోర్టల్ లేదా సాంఘిక సంక్షేమ శాఖ వెబ్‌సైట్లను సందర్శించాలి
-సీనియర్ సిటిజన్ లాగిన్ లేదా కొత్త యూజర్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేసి వివరాలు అందించాలి
-అనంతరం ఆ వివరాలతో లాగిన్ అవ్వాలి
– ఆ తర్వాత దరఖాస్తు ఫారం ఆప్షన్ సెలక్ట్ చేసుకోవాలి
-దరఖాస్తు ఫారంలో మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, లింగం, అడ్రస్ వివరాలు నింపాలి
– వయస్సు, నివాస ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజు ఫోటో లాంటివి అప్‌లోడ్ చేయాలి
– ఫారం నింపిన తర్వాత, అన్ని వివరాలను ఒకసారి సరిచూసుకుని సబ్మిట్ చేయాలి
-రూ.10 ఫీజు చెల్లించాలి
-అనంతరం అప్లికేషన్ లేదా అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ సేవ్ చేసుకోవాలి
-15-30 రోజులలోపు ఈ పోర్టల్‌లోకి లాగిన్ అయిసీనియర్ సిటిజన్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి
కార్డు ఉంటే లాభాలేంటి..?
బస్సుల్లో 30 శాతం నుంచి 50 శాతం వరకు టికెట్లపై రాయితీ సౌకర్యం పొందవచ్చు. ట్రైన్లలో లోయర్ బెర్త్‌లు, ప్రత్యేక టికెట్ కౌంటర్ల సదుపాయం ఉంటుంది. ఇక ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్ల ప్రత్యేక ఓపీడీ టోకెన్లు, పరీక్షలు ఉంటాయి. ఇక బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లపై అదనపు వడ్డీ లభిస్తుంది. ఇక విమానాల్లో కూడా టికెట్లపై 50 శాతం వరకు రాయితీని కొన్ని విమానయాన సంస్థలు కల్పిస్తున్నాయి.