Reading Time: 2 minutes

నిన్నటి వరకు జెన్ జెడ్.. ఇప్పుడు జెడ్ ఆల్ఫా.. రోడ్డుకోసం స్కూల్ విద్యార్థుల కలెక్టరేట్ ముట్టడి 

Caption of Image.

ఓ వైపు  జెన్ జెడ్ యువత ఉద్యమం కొనసాగుతున్న క్రమంలో  మరో జనరేషన్ రోడ్లపైకి వచ్చింది.  జెన్ జెడ్ తర్వాత కనీస సదుపాయాలకోసం మరో తరం జెడ్ ఆల్ఫా నిరసన బాట పట్టింది. తమ సమస్యల పరిష్కారం కోసం విద్యార్థులు నిరసనకు దిగారు. జాతీయ జెండాలు చేతబట్టి కిలోమీటర్లు పాదయాత్రగా ర్యాలీ చేశారు. అనంతరం తమ డిమాండ్లు నెరవేర్చాలని  కలెక్టరేట్ ను ముట్టడించారు. 

యూపీలోని హమీన్ పూర్ లో మౌలిక సదుపాయాలకోసం పాఠశాల విద్యార్థులు నిరసన మార్గం ఎంచుకున్నారు. కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి మెయిన్ దగ్గర బైఠాయించారు. జాతీయ జెండాలు, ప్లకార్డులు, బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. వారివెంట విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. తమ ప్రాంతానికి మంచి రోడ్డు సౌకర్యం కల్పించాలని అధికారులను కోరారు.విద్యార్థుల నిరసనలతో కలెక్టరేట్ కార్యకలాపాలు నిలిచిపోయాయి. 

యమునానది పరివాహక ప్రాంతమైన హమీన్ పూర్ లోని కొన్ని నివాసాలకు సరైన రోడ్డు మార్గం లేదు. దాదాపు 2కిలోమీటర్లమేరకు రోడ్డు అధ్వాన్నంగా ఉంది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై నడవలేని స్థితి నెలకొంది. దీంతో విద్యార్థులు స్కూల్ కువెళ్లే పరిస్థితిలేదు. దీంతో తల్లిదండ్రులతో కలిసి  స్కూల్ విద్యార్థులు ర్యాలీగావెళ్లి కలెక్టరేట్ ముట్టడించారు. 

మంగళవారం(ఆగస్టు11) ఉదయం నిరసనకారులు కలెక్టరేట్ వైపు వెళ్తుండగా  పోలీసులు అడ్డుకున్నారు. చిన్నారి విద్యార్థులు వారిని తప్పించుకొని కలెక్టరేట్ కు చేరుకున్నారు. మెయిన్ గేట్ ను దిగ్భంధించారు. నిరసన విరమించుకోవాలని అధికారులు వారిని ఒప్పించేందుకు ప్రయత్నించగా, పిల్లలు కదలడానికి నిరాకరించారు. దీంతో లోపల ఉన్న అధికారులు, ఉద్యోగులు బయటకు వెళ్లలేకపోయారు.

విద్యార్థుల డిమాండ్ ఏంటీ..

యమునానది పరిశాహక ప్రాంతాలైన బ్రహ్మ కా డేరా, బన్వాసి కా డేరా, అత్భయన్ కా డేరా, బచ్చి కా డేరా, భిఖువా కా డేరా, గుసాయి బాబా కా డేరా ,గాంగ్వా కా డేరాతో సహా చందుపూర్ ,చుట్టుపక్కల డేరాలలో నివసిస్తున్న దాదాపు 3వేల మంది నివాసితులకు ఈ రహదారి ప్రధాన మార్గం. రోడ్డు పరిస్థితి కారణంగా పిల్లలు పాఠశాలకు వెళ్లడం కష్టంగా ఉందని, అనారోగ్యంతో ఉన్నవారిని ఆసుపత్రులకు తీసుకెళ్లడంలో కూడా సమస్యలు తలెత్తాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇక  జెడ్ ఆల్పా విద్యార్థుల నిరసనలకు జెడ్ జెడ్ యువత, సీజేపీ  ఫౌండర్ అభిజిత్ దీప్కేతో, సౌరవ్ దాస్ లు మద్దతు పలికారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ వీడియోను షేర్ చేస్తూ, పంద్రాగస్టున మన గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను బాగుచేసేందుకు ప్రతిజ్ఞ చేద్దాం” అని పిలుపునిచ్చారు. 

తమ భవిష్యత్తు కోసం పోరాడుతున్న ఈ పిల్లలకు వందనం..వారు అడుగుతున్నదల్లా తమ పాఠశాలకు ఒక రోడ్డు మాత్రమే. స్వాతంత్ర్యం వచ్చి దాదాపు 80 ఏళ్ల తర్వాత ఇది అడగడానికి మరీ ఎక్కువ అవుతుందా?..ఇది దశాబ్దాల క్రితమే జరిగి ఉండాల్సింది. ఈ ఆగస్టు 15న, గ్రామీణ భారతదేశంలోని పిల్లలు, పాఠశాలల కోసం పనిచేస్తామని ప్రతిజ్ఞ చేద్దామని అభిజిత్ దీస్కే పోస్ట్  షేర్ చేశారు. 

©️ VIL Media Pvt Ltd.