Reading Time: 2 minutes
Akshay Kumars Alien Thriller Samuk Movie Shooting Starts Soon In London

Samuk: అక్షయ్ కుమార్ ఈ సారి సరికొత్త జానర్‌ను ఎంచుకున్నారు. ఏలియన్ థ్రిల్లర్ ‘సముక్’ తో కొత్త ప్రయోగం చేయబోతున్నారు. లండన్‌లో ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుండగా, దాదాపు 90 శాతం షూటింగ్ అక్కడే జరగనుంది. మిగిలిన భాగాన్ని ముంబైలో తెరకెక్కించనున్నారు. అక్షయ్ కుమార్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే ‘సముక్’ ఆయన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచే ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏలియన్ థ్రిల్లర్ జానర్ ఇండియన్ సినీ హిస్టరీలో అరుదుగా కనిపించడంతో ఈ సినిమాపై ఆసక్తి ఏర్పడుతోంది. దర్శకుడు కనిష్క్ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షూటింగ్‌ను నిరంతర షెడ్యూల్‌లో పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

ఈ సినిమా షూటింగ్ ఆగస్టు 23న లండన్‌లో ప్రారంభం కానుంది. చిత్రీకరణలో సుమారు 90 శాతం లండన్‌లోనే జరగనుండగా, మిగిలిన సన్నివేశాలను ముంబైలో తెరకెక్కించనున్నారు. విదేశీ లొకేషన్లతో పాటు, విజువల్ ఎఫెక్ట్స్, ఏలియన్ డిజైన్ ఈ సినిమాకు కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. భారతీయ ప్రేక్షకులకు కొత్త తరహా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌ను అందించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఇక ‘సముక్’కు విపుల్ అమృత్‌లాల్ షా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అక్షయ్ కుమార్, విపుల్ గతంలో ‘ఆంఖేన్’, ‘వక్త్: ది రేస్ ఎగైనెస్ట్ టైమ్’, ‘నమస్తే లండన్’, ‘సింగ్ ఈజ్ కింగ్’, ‘యాక్షన్ రిప్లే’ వంటి సినిమాల కోసం కలిసి పనిచేశారు. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్‌లో వస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు భారీగానే ఏర్పడుతున్నాయి.

ఈ సినిమాలో అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ ప్రొఫెషనల్స్ పనిచేస్తున్నారు. దీంతో ఏలియన్ డిజైన్, యాక్షన్ సీక్వెన్స్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు హైలెట్ గా ఉండే అవకాశం కనిపిస్తోంది. కథలో సస్పెన్స్, థ్రిల్‌తో పాటు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడంపై మేకర్స్ దృష్టి  పెట్టబోతున్నారు. ఇప్పటికే ఇలాంటి కంటెంట్ తో వచ్చిన సినిమాలకు ఆడియన్స్ నుంచి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. హృతిక్ ‘క్రిష్’ అయితే సంచలనాలే క్రియేట్ చేసింది. అయితే అక్షయ్ ఈ క్రేజీ కాన్సెప్ట్ తో ఎలా మెప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు అక్షయ్ కుమార్ చేతిలో మరిన్ని ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్నాయి. ఆర్.డి. బర్మన్ బయోపిక్‌తో పాటు ‘గోల్మాల్ 5’ కూడా ఆయన లైనప్‌లో ఉంది. ప్రస్తుతం అక్షయ్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ‘హైవాన్’ సెప్టెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది. అయితే వీటన్నింటిలో ‘సముక్’ మాత్రం ఏలియన్ థ్రిల్లర్ కావడంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. లండన్‌లో ప్రారంభమయ్యే షూటింగ్‌తో ఈ సినిమా కథ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి ఇప్పుడు అభిమానుల్లో మొదలైంది.