Reading Time: < 1 minute

శ్రీశైలంలో వైభవంగా శ్రావణమాసం ఉత్సవాలు.. మల్లన్న ఆర్జిత సేవల్లో కీలక మార్పులు

Caption of Image.

శ్రీశైలం ఆలయంలో ఆగస్టు 13 నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు శ్రావణ మాసోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం ఆర్జిత సేవల్లో పలు మార్పులు చేసింది.  మంగళవారం నుంచి శుక్రవారం వరకు సామూహిక, గర్భాలయ అభిషేకాలు, కుంకుమార్చనలు యథావిధిగా కొనసాగుతాయి. 

విశ్వశాంతి ..  లోక కళ్యాణార్ధం ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్​ 11 వరకు  శ్రావణమాసమంతా శ్రీశైలంలో భ్రమరాంబికా సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో  అఖండ శివనామ భజనలు జరుగనున్నాయి.  భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రావణమాసంలో  మొత్తం 19 రోజులు ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు, నిలుపుదల  చేశారు.  ఆగష్టు 18,  సెప్టెంబర్ 1,8 తేదీల్లో ..  మంగళవారం కూడా ఉదయం గర్భాలయా అభిషేకాలు నిలుపుదల చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 

శ్రావణమాసం శని, ఆది, సోమవారాల్లో ఈ సేవలను పూర్తిగా రద్దు చేశారు. ఈ రోజులలో ఒక్క విడత రాత్రి 8:30 కు 250 టికెట్స్ మాత్రమే  అందుబాటులో ఉంటాయి.  శ్రావణామాసం రద్దీ రోజులు మినహా మిగిలిన రోజుల్లో 3 విడతలుగా స్పర్శ దర్శనాలు, సామూహిక,గర్భాలయ అభిషేకాలు, కుంకుమార్చనలు యధావిధిగా కొనసాగుతాయి. అలాగే, శ్రావణ మాసంలోని 2, 3, 4వ శుక్రవారాల్లో భక్తుల కోసం ఉచిత సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు.ఉత్సవాల సందర్భంగా క్యూలైన్లలో భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 

©️ VIL Media Pvt Ltd.