Reading Time: < 1 minute

ఇందిరా గాంధీ హత్య కేసులో దోషి కుమారుడు.. పంజాబ్ ఎన్నికల్లో పోటీ

Caption of Image.

ఇందిరా గాంధీ హత్య కేసులో దోషి అయిన కేహర్ సింగ్ కుమారుడు సత్వంత్ సింగ్.. పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2027లో జరగనున్న పంజాబ్ ఎన్నికలకు సంబంధించి అకాలీ దల్ వారిస్ పంజాబ్ దే పార్టీ తొలి అభ్యర్థిగా సంత్వంత్ సింగ్ ను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. 

సత్వంత్ సింగ్ (61) ఫతేగర్ సాహిబ్ జిల్లాలోని పఠాన అసెంబ్లీ నుంచి పోటీ చేయనున్నారు. 

సత్వంత్ తండ్రి కేహార్ సింగ్.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు కుట్ర చేశారని.. హత్య కేసులో దోషిగా శిక్ష అనుభవించాడు. 

1984 అక్టోబర్ 31న ఇందిరా ఇద్దరు అంగ రక్షకులు (బాడీగార్డ్స్) ఆమె ఇంట్లోనే హత్య చేశారు. 

అకాలీ దల్ వారిస్ పంజాబ్ దే అధ్యక్షుడు తర్సేమ్ సింగ్ తమ పార్టీ తొలి అభ్యర్థిగా సత్వంత్ సింగ్ ను ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.  ఖదూర్ సాహిబ్ ఎంపీ అయిన అమృత్ పాల్ సింగ్ తండ్రి తస్రేమ్ సింగ్. తస్రేమ్ ప్రస్తుతం అస్సాం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.  2023లో అజ్నాలా పోలీస్ స్టేషన్ పై దాడి కేసులో ఆయన జైల్లో ఉన్నారు. 

©️ VIL Media Pvt Ltd.