Reading Time: 2 minutes
Vijay Final Film Jana Nayagan Streaming Date And Platform Check Here Details

Jana Nayagan OTT Release: థియేటర్లలో విజయ్ తలపతి చివరి సినిమాగా భారీ హైప్ తెచ్చుకున్న ‘జన నాయగన్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రన్‌లో మంచి వసూళ్లు సాధిస్తూ దూసుకెళ్తున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ డిజిటల్ రిలీజ్‌పై ఇప్పటికే ఆసక్తి మొదలైంది. అసలు ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి రానుంది? ఏ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది? హిందీ వెర్షన్ పరిస్థితి ఏంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

తమిళ సూపర్ స్టార్ విజయ్ తలపతి కెరీర్ లో ‘జన నాయగన్’ చివరి చిత్రంగా ప్రచారం జరుగుతుండటంతో సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. థియేటర్లలో మూడో వారాంతానికి చేరుకున్నా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ కొనసాగుతోంది. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా  జులై 23 న థియేటర్లలో అడుగు పెట్టింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹320 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినప్పటికీ, సుమారు ₹350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కడం, పలు థియేటర్లలో ప్రదర్శన నిలిచిపోవడం కారణంగా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గానే నిలిచింది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్ ను పలకరించేందుకు వస్తోంది.

సాధారణంగా దక్షిణాది సినిమాలు థియేటర్లలో విడుదలైన కొన్ని వారాల తర్వాత ఓటీటీలోకి వస్తుంటాయి. నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కావడం సాధారణంగా కనిపిస్తుంది. అయితే థియేటర్లలో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్న సినిమాలకు మాత్రం ఓటీటీ విడుదల విషయంలో నిర్మాతలు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా హిందీ వెర్షన్‌ను వేరే డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు ఇచ్చే అవకాశం ఉంటుంది.

‘జన నాయగన్’ విషయంలోనూ ఇదే తరహా పరిస్థితి కనిపించనుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను 2026 సెప్టెంబర్ 21న జీ5లో స్ట్రీమింగ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ వార్త నిజమైతే తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులు ఇంటి నుంచే విజయ్ చివరి సినిమాను చూసే అవకాశం లభిస్తుంది. అయితే హిందీ ప్రేక్షకులకు మాత్రం కొంతకాలం వేచి చూడాల్సి రావచ్చు. ‘జన నాయగన్’ హిందీ వెర్షన్ జీ5లో కాకుండా మరో  ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇందులో అమెజాన్ ప్రైమ్ వీడియో పేరు కూడా వినిపిస్తోంది. అయితే రిలీజ్ డేట్ పై చిత్రబృందం ఇంకా ఆఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సిఉంది.

థియేటర్లలో విజయ్ చివరి సినిమా మిస్ కాకుండా చూసుకున్న అభిమానులు, ఇప్పుడు అదే సినిమాను ఓటీటీలో ఎప్పుడు చూడొచ్చా అని ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 21న జీ5లో స్ట్రీమింగ్ అనే వార్త ఆఫీషియల్ గా ఖరారైతే, దక్షిణాది భాషల్లో డిజిటల్ ప్రేక్షకులకు మరోసారి ‘జన నాయగన్’ సందడి మొదలుకానుంది. ఇక హిందీ వెర్షన్‌కు ఏ ప్లాట్‌ఫామ్ ఖరారవుతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.