Reading Time: 2 minutes
DC Movie: ఒక్క సినిమాతో మారిపోయిన వామికా గబ్బి జాతకం.. మరో స్టార్ హీరో సినిమాలో ‘డీసీ’ హీరోయిన్ కు ఛాన్స్

హీరోయిన్ వామికా గబ్బికి 2026 సంవత్సరం బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం ప్రారంభంలో అక్షయ్ కుమార్ తో కలిసి ఆమె నటించిన ‘భూత్ బంగ్లా’ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘పతి పత్ని ఔర్ వో 2’తోనూ మరో హిట్ అందుకుందీ అందాల తార. ఇక లేటెస్ట్ గా ఆమె నటించిన తమిళ చిత్రం ‘డీసీ’ సంచలన విజయం సాధించింది. ఈ సినిమాలో వామిక పోషించిన చంద్ర పాత్ర విమర్శకులతో పాటు ప్రేక్షకుల నుంచి కూడా అపారమైన ప్రశంసలను అందుకుంటోంది. ఈ చిత్రంలో లోకేష్ కనగరాజ్ కథానాయకుడిగా ఉన్నప్పటికీ, వామికా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు  వరుస అవకాశాలు వస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు అడివి శేష్ ‘గూఢచారి 2’లో హీరోయిన్‌గా నటిస్తోందీ అందాల తార. ఇప్పుడు వామిక కెరీర్‌లో మరో పెద్ద అవకాశం లభించినట్లు తెలుస్తోంది. హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో, ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తున్న పాన్-ఇండియన్ పౌరాణిక చిత్రం ‘జై హనుమాన్’లో వామిక ఒక ప్రధాన పాత్రకు ఎంపికైనట్లు సమాచారం.

ప్రశాంత్ వర్మ ‘సినిమాటిక్ యూనివర్స్’లో భాగమైన జై హనుమాన్ చిత్రం షూటింగ్ మార్చిలో ప్రారంభమైంది. అయితే వామిక గబ్బి పాత్ర వివరాలను ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారు. ఈ చిత్రంలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో నటిస్తున్నారు. ఇది 2024లో రిలీజై బ్లాక్‌బస్టర్ గా నిలిచిన ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్. ‘మైత్రి మూవీ మేకర్స్’ నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా పౌరాణిక చిత్రాన్ని 2027 ద్వితీయార్థంలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి చిత్ర బృందం ప్రణాళిక వేసింది. అయిదే వామిక గబ్బి పాత్ర వివరాలను చిత్ర బృందం ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఇవి కాకుండా, వామిక చేతిలో రాజ్‌కుమార్ రావుతో ‘ప్రహార్’, ‘దిల్ కా దర్వాజా ఖోల్ నా డార్లింగ్’, ‘జీనీ’, ‘కుకు కి కుండలి’ వంటి భారీ ప్రాజెక్ట్‌లు ఉన్నాయి.

లోకేష్ కనగరాజ్ డీసీ సినిమాలో వామికా గబ్బి..

 

View this post on Instagram

 

A post shared by Sun Pictures (@sunpictures)

 

View this post on Instagram

 

A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi)

 

View this post on Instagram

 

A post shared by Wamiqa Gabbi (@wamiqagabbi)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.