
ప్రముఖ ఉక్కు తయారీ సంస్థ పుల్కిత్ టిఎమ్‌టి తన వార్షిక డీలర్ల మహాసమ్మేళనం విజయోత్సవం 2026ను తిరుపతిలో అత్యంత వైభవంగా నిర్వహించింది. వ్యాపార పురోగతి, భాగస్వామ్యం, భవిష్యత్తు ప్రణాళికల లక్ష్యంగా జరిగిన ఈ వేడుకలో దాదాపు 150 మంది డీలర్లు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ వేడుకకు పుల్కిత్ టిఎమ్‌టి ఛైర్మన్ వినోద్ గార్గ్, సీఈవో పుష్పిత్ గార్గ్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఏవీపీ శరత్ మోహన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నాయకత్వం వహించారు. తమతో సుదీర్ఘకాలంగా ప్రయాణిస్తున్న డీలర్ల భాగస్వామ్యానికి, వారి కృషికి సంస్థ యాజమాన్యం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లక్ష్యాలను, వ్యాపార వ్యూహాలను ఈ సందర్భంగా డీలర్లతో పంచుకున్నారు.
2026-27 స్కీమ్ ప్రారంభం
ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా 2026-27 కొత్త డీలర్ స్కీమ్ ఆవిష్కరణ నిలిచింది. స్టీల్ రంగ చరిత్రలోనే తొలిసారిగా డ్రోన్ బ్రాండింగ్, 200 అడుగుల భారీ డిజిటల్ స్క్రీన్ సహాయంతో వినూత్నంగా ఈ కొత్త స్కీమ్‌ను ప్రారంభించారు. అధునాతన సాంకేతికత, సరికొత్త బ్రాండింగ్ కలయికతో రూపొందించిన ఈ ప్రదర్శన డీలర్లను, ఆహూతులను విశేషంగా ఆకట్టుకుంది.
విజేతలకు బహుమతుల ప్రదానం
2025 సంవత్సరంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 38 మంది డీలర్లను పుల్కిత్ టిఎమ్‌టి యాజమాన్యం ప్రత్యేకంగా సత్కరించి, విలువైన బహుమతులను అందజేసింది.
అగ్రస్థానంలో నిలిచిన టాప్-3 డీలర్లు
- మొదటి బహుమతి (మారుతి ఆల్టో K10 కార్): విజయలక్ష్మి ఎంటర్‌ప్రైజెస్ – బాలసుబ్రహ్మణ్యం రెడ్డి
- రెండవ బహుమతి (రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్): క్వాలిటీ స్టీల్ షోప్ – శ్రీ వంశీకృష్ణ రెడ్డి
- మూడవ బహుమతి (యామహా FZS బైక్): చెంచు లక్ష్మి స్టీల్ అండ్ సిమెంట్ – శ్రీ ప్రసాద్ రెడ్డి
అలోక్ ఇన్ఫోటెక్ నిర్వహణ
ఈ విజయోత్సవం 2026 ఈవెంట్‌ను అలోక్ ఇన్ఫోటెక్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించింది. ఈవెంట్ ప్రొడక్షన్, డీలర్ ఎంగేజ్‌మెంట్, డ్రోన్ బ్రాండింగ్, 200 అడుగుల స్క్రీన్ ఏర్పాటు వరకు ప్రతి అంశాన్ని అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించి, ఈ వేడుకను ఓ చిరస్మరణీయ అనుభూతిగా మలిచింది. మొత్తానికి డీలర్ల సేవలను గుర్తిస్తూ, భవిష్యత్తు వృద్ధికి కొత్త దిశానిర్దేశం చేసిన పుల్కిత్ టిఎమ్‌టి విజయోత్సవం 2026 వేడుక అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ముగిసింది.