Reading Time: < 1 minute

DRDOలో ఇంటర్న్షిప్స్ ఖాళీలు.. ఎగ్జామ్ లేదు.. ప్రతినెల స్టైఫండ్ కూడా.. పూర్తి వివరాలివే..

Caption of Image.

డీఆర్​డీఓ కాంబట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌‌‌‌మెంట్ ఎస్టాబ్లిష్‌‌‌‌మెంట్ (సీబీఆర్​డీఈ) పెయిడ్ ఇంటర్న్​షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేయవచ్చు.

పోస్టు పేరు: పెయిడ్ ఇంటర్న్​షిప్. 

మొత్తం ఖాళీలు: 35. 

విబాగాల వారీగా ఖాళీలు
యూజీ ఇంటర్న్​షిప్: మెకానికల్ ఇంజినీరింగ్ 7, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్‌‌‌‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 5, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (ఈఈ) 2, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ మెషిన్ లెర్నింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 01. 

పీజీ ఇంటర్న్​షిప్:  మెకానికల్ ఇంజినీరింగ్ 12, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ / ఎలక్ట్రానిక్స్ & ఇన్‌‌‌‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 5, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (ఈఈ) 2, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్/ మెషిన్ లెర్నింగ్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 01. 

ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ / బీటెక్ 7వ లేదా 8వ సెమిస్టర్, ఎంఈ/ ఎం.టెక్ 1వ లేదా 2వ సంవత్సరం ఫుల్-టైమ్ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. 

గరిష్ట వయోపరిమితి: 28 ఏళ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 10.

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 01. 

సెలెక్షన్ ప్రాసెస్: అకడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

మరిన్ని వివరాలకు వెబ్​సైట్ drdo.gov.inను సందర్శించండి. 

©️ VIL Media Pvt Ltd.