Reading Time: 2 minutes

ముక్కుపుడక మింగేసిన హీరోయిన్.. షూటింగ్ లో ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Caption of Image.

సినిమా షూటింగ్‌లో నటీనటులు పాత్రలో పూర్తిగా లీనమైపోతే.. చుట్టూ ఏం జరుగుతుందో కూడా మర్చిపోతుంటారు. కానీ అదే అంకితభావం కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలకు దారితీస్తుంది. లేటెస్ట్ గా పంజాబీ నటి, సింగర్‌ షెహ్నాజ్ గిల్‌కు షూటింగ్ సెట్‌లో అలాంటి షాకింగ్ అనుభవమే ఎదురైంది. ఓ సన్నివేశంలో పరుగెత్తుతున్న సమయంలో ఆమె ధరించిన సంప్రదాయ ముక్కుపుడక ఒక్కసారిగా ఊడి నేరుగా నోట్లోకి జారిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 ఉక్కిరిబిక్కిరైన షెహ్నాజ్!

షెహ్నాజ్ గిల్ ప్రస్తుతం ‘ఇష్క్నామా’ అనే పీరియడ్ రొమాంటిక్ డ్రామాలో నటిస్తున్నారు. దర్శకుడు అరవింద్‌ ఖైరా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలోని ఓ కీలక సన్నివేశం కోసం షెహ్నాజ్ వేగంగా పరుగెత్తాల్సి వచ్చింది. సీన్‌లో పూర్తిగా లీనమైన ఆమెకు.. ఆ సమయంలో ముక్కుకు ఉన్న  ముక్కుపుడక  ఊడిపోయి నోట్లోకి వెళ్లిపోయిన విషయం వెంటనే గుర్తించలేకపోయారు.

పాత్రలో ఇంతగా లీనమయ్యారా?

షాట్‌ పూర్తయిన కొద్దిసేపటికే ఆమెకు దగ్గు రావడంతో అసలు విషయం బయటపడింది. షెహ్నాజ్ ఇబ్బంది పడుతుండటాన్ని గమనించిన సహనటుడు సౌరభ్ సచ్‌దేవా వెంటనే స్పందించి ఆమె వీపుపై తట్టి సహాయం చేశారు. దీంతో పరిస్థితి కుదుటపడింది.  ఈ భయపెట్టే ఘటనను షెహ్నాజ్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ‘నథ్ని మూమెంట్‌’ వీడియోను పోస్ట్ చేయాలని అభిమానులు చాలాకాలంగా అడుగుతున్నారని ఆమె వెల్లడించారు. వీడియో చూసిన నెటిజన్లు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తూనే.. మరోవైపు సన్నివేశంలో ఆమె చూపించిన డెడికేషన్‌ను ప్రశంసిస్తున్నారు. ‘పాత్రలో ఇంతగా లీనమయ్యారా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

►ALSO READ | విజయ్ టీవీకేకు పోటీగా ధనుష్ పొలిటికల్ ఎంట్రీ? ఫ్యాన్స్‌ క్లబ్‌ సంచలన నిర్ణయం.. అసలు టార్గెట్‌ అదేనా?

సరిహద్దులు దాటే ప్రేమకథతో..

‘ఇష్క్నామా’లో షెహ్నాజ్ గిల్‌, జై రంధావా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారత పంజాబ్‌కు చెందిన సిక్కు కవి నిమ్మ, పాకిస్థాన్ పంజాబ్‌కు చెందిన ముస్లిం యువతి నసీమ్ మధ్య చిగురించే ప్రేమే ఈ కథకు ప్రధాన నేపథ్యం. సౌరభ్ సచ్‌దేవా, అంజుమ్ బత్రా, మహన్‌బీర్ భుల్లర్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. షూటింగ్‌లో జరిగిన ఈ చిన్న ప్రమాదం.. ఇప్పుడు సినిమాపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.

 

©️ VIL Media Pvt Ltd.