Reading Time: 2 minutes

Vishal : రాజకీయాలు వేరు.. స్నేహం వేరు.. విజయ్‌కు షాకిచ్చేలా విశాల్ కామెంట్స్.. ఉదయనిధిపై ఇంత ప్రేమా?

Caption of Image.

తమిళనాడు రాజకీయాల్లో విజయ్ వర్సెస్ డీఎంకే పోరు ఎంత హాట్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ నేతృత్వంలోని టీవీకే అధికారంలోకి రావడంతో ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు డీఎంకేకు చెందిన ఉదయనిధి స్టాలిన్ ఎమ్మెల్యేగా గెలిచినా, ఆయన తండ్రి, మాజీ సీఎం ఎంకే స్టాలిన్ మాత్రం ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. ఈ రాజకీయ పరిణామాల మధ్య సినీ స్నేహాలపై కూడా చర్చనీయాంశంగా మారింది.

 ఉదయనిధిపై నా అభిమానం తగ్గదు..

ఇలాంటి సమయంలో లేటెస్ట్ గా హీరో విశాల్ చేసిన కామెంట్స్ తమిళ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.   చెన్నైలో  నిర్వహించిన ‘మగుడం ‘ ఆడియో లాంచ్ వేడుకలో ఉదయనిధి స్టాలిన్‌పై తనకున్న అభిమానం ఏమాత్రం తగ్గలేదని విశాల్ క్లియర్‌గా చెప్పేశారు. ఉదయ్, ఆయన భార్య కృతికను నేను ఎప్పటికీ అభిమానిస్తాను. ఏం జరిగినా నా అభిమానం మారదు అంటూ ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల విజయ్, త్రిషా కృష్ణన్‌లను ఉద్దేశించిన ఉదయనిధి  అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద దుమారం రేగింది.  ఉదయ్ ను అరెస్ట్ చేసి . ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. ఈ వ్యవహారంపై గతంలో విశాల్ కూడా స్పందిస్తూ.. మహిళలపై అనుచితంగా మాట్లాడేవారందరికీ ఒకే రకమైన చర్య ఉండాలని కోరారు.  నా స్నేహితుడు ఉదయ్ ఏదో మాట్లాడి అరెస్ట్ అయ్యారు. కానీ సీనియర్ ఆర్టిస్టుల గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడే యూట్యూబర్ల సంగతేమిటి? అని ప్రశనించారు విశాల్ . 

స్నేహం ముందు.. రాజకీయాలు తర్వాత ..

అయితే రాజకీయంగా ఎవరి వైపు ఉన్నా, వ్యక్తిగతంగా మాత్రం ఉదయనిధితో తన స్నేహం ఎప్పటికీ మారదని విశాల్ తేల్చేశారు.  చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. గోపాలపురంలో ముగ్గురూ స్కూటర్‌పై తిరుగుతూ పోలీసులకు దొరికేవాళ్లమని, అప్పుడు నీ నాన్న పేరు చెప్పు అని ఉదయనిధిని అడిగేవాడినని నవ్వుతూ చెప్పారు. కానీ ఉదయనిధి ఎప్పుడూ తండ్రి పేరును ఉపయోగించుకోవడానికి ఇష్టపడేవారు కాదని వెల్లడించారు.

ఇక రాజకీయాల్లోకి తాను వస్తే ఉదయనిధితో పోటీ ఉన్నా అది ఆరోగ్యకరమైన పోటీ మాత్రమేనని విశాల్ స్పష్టం చేశారు. అదే సమయంలో యూట్యూబ్‌లో సినీ హీరోయిన్లు, సీనియర్ నటీమణులపై అసభ్యకర వ్యాఖ్యలు చేసే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం విజయ్‌ను కోరారు.

మొత్తానికి.. సీఎం విజయ్, ప్రతిపక్ష నేత ఉదయనిధి, రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న విశాల్ మధ్య రాజకీయ సమీకరణాలు ఎలా మారినా.. విశాల్ మాత్రం స్నేహం ముందు.. రాజకీయాలు తర్వాత అంటూ సరికొత్త ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించిన ‘మగుడం’ ఆగస్టు 14న థియేటర్లలోకి రానుంది.

 

©️ VIL Media Pvt Ltd.