Reading Time: < 1 minute

కోఠి,సుల్తాన్ బజార్ లో.. బ్రాండెడ్ పేరుతో నకిలీ ఎగ్జాస్ట్ ఫ్యాన్ల దందా..3 షాపులపై పోలీసుల దాడులు 

Caption of Image.

హైదరాబాద్ సిటీలో ఒరిజినల్ బ్రాండ్లకంటే నకిలీ బ్రాండెడ్ వస్తువుల దందా జోరుగా సాగుతోంద.. ప్రముఖ కంపెనీల బ్రాండ్ల ను నకలి చేసి మార్కెట్లో నాణ్యత లేని వస్తువులను విక్రయిస్తూ అక్రమంగా సంపాదిస్తున్నారు వ్యాపారులు.  బ్రాండెడ్‌ కంపెనీ పేరుతో నకిలీ ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లను విక్రయిస్తున్న మూడు ఎలక్ట్రికల్ షాపులపై సుల్తాన్‌బజార్‌ పోలీసులు దాడులు నిర్వహించారు.వివరాల్లోకి వెళితే..

 కోఠి, సుల్తాన్ బజారులోని పలు ఎలక్ట్రిక్ షాపులపై బుధవారం(ఆగస్టు12)  పోలీసులు దాడులు చేశారు. కోఠి ట్రూప్‌ బజార్‌లోని హైటెక్‌ గెలాక్సీ, పవార్‌ లింక్, హుకుం ఎలక్ట్రికల్‌ షాపుల్లో ఈ దాడులు జరిగాయి. బ్రాండెడ్‌ పేరుతో నకిలీ ఉత్పత్తులు విక్రయిస్తున్నారంటూ ఇంటెలెక్చువల్‌ ప్రాపర్టీ ఇన్వెస్టిగేషన్‌ సర్వీసెస్‌ రీజినల్‌ హెడ్‌ నాగేశ్వర్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు ఆయా దుకాణాలపై తనిఖీలు నిర్వహించగా భారీగా నకిలీ క్రాంప్టన్‌ ఎగ్జాస్ట్‌ ఫ్యాన్లు బయటపడ్డాయి. పోలీసులు సుమారు రూ.8 లక్షల విలువైన 400 నకిలీ ఫ్యాన్లను స్వాధీనం చేసుకున్నారు. దుకాణాల యజమానులు నజరుద్దీన్, అదునాన్, వీరేందర్‌లను అరెస్టు చేశారు. వారిపై ట్రేడ్‌మార్క్‌, కాపీరైట్‌ చట్టాలతోపాటు చీటింగ్‌ కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

©️ VIL Media Pvt Ltd.