Reading Time: 2 minutes

Rainy season Food.. ఎల్లి కారం, కరివేపాకు పొడి.. సర్ది,దగ్గుకు మంచి ఔషధం.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి..!

Caption of Image.

వాతావరణం చల్లగా ఉన్నా… ముసుర్లు పడుతున్నా… పిల్లలు దగ్గర్నించి పెద్దోళ్ల వరకు సర్దో, దగ్గో వస్తనే ఉంటది. ఆ టైంలో నాలుకకు ఏది తిన్నా రుచించదు. అలాంటప్పుడు అన్నం, టిఫిన్లలో కారం వేసుకుని తింటే నోటికి మంచిగ అనిపిస్తది. అలాంటి కారాన్ని ఎన్నోరకాలుగా చేసుకోవచ్చు. అందులో కొన్ని వెరైటీస్ మీకోసం. . .!

 ఎల్లిపాయ కారం తయారీకి కావాల్సినవి 

  • ఎండుమిర్చి: పదిహేను
  •  మినప్పప్పు: ఒక టేబుల్ స్పూన్
  •  పెసరపప్పు: ఒక టేబుల్ స్పూన్
  •  శెనగపప్పు: ఒక టేబుల్ స్పూన్
  •  అవిసె గింజలు (కావాలనుకుంటే): ఒక టీ స్పూన్
  •  పసుపు: అర టీ స్పూన్
  •  మిరియాలు: అర టీ స్పూన్
  •  జీలకర్ర: పావు టీ స్పూన్
  •  ఉప్పు: తగినంత
  •  వెల్లుల్లి గడ్డలు: రెండు
  •  కరివేపాకు: రెండు రెమ్మలు

ఎల్లిపాయ కారం తయారీ విధానం 

  •  స్టవ్​ పై  పాన్​ పెట్టి శెనగపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, ఎండుమిర్చి, అవిసె గింజలు, మిరియాలు, జీలకర్రలను విడివిడిగా వేగించాలి. 
  • స్టవ్ ఆఫ్ చేశాక, వేడిగా ఉన్న గిన్నెలో కరివేపాకు వేస్తే… అది కొద్దిగా వేగుతుంది. 
  • తర్వాత మిక్సీలో ఎండుమిర్చి తప్ప… వేగించుకున్న మిగతా అన్ని పదార్థాలను వేసి గ్రైండ్ చేయాలి. 
  • అది పొడి కాగానే కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలను వేసి మళ్లీ ఒక రౌండ్ తిప్పాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు వేసి గ్రైండ్ చేయాలి. 
  • తర్వాత పొడిని గిన్నెలోకి తీసుకొని బాగా కలపాలి. 
  • వేడివేడి అన్నంలో ఈ ఎల్లిపాయ కారం కలుపుకుని తింటే…. అదిరిపోతుంది.

కరివేపాకు  పొడి తయారీకి కావాల్సినవి 

  • శెనగపప్పు: ఒక టేబుల్ స్పూన్
  •  మినప్పప్పు: ఒక టేబుల్ స్పూన్
  •  నువ్వులు: ఒక టేబుల్ స్పూన్
  •  ఎండుమిర్చి: ఆరు
  •  జీలకర్ర:ముప్పావు టీ స్పూన్
  •  వెల్లుల్లి రెబ్బలు: నాలుగు
  •  కరివేపాకు: ఏడు రెమ్మలు
  •  నూనె: సరిపడా

కరివేపాకు  పొడి తయారీ విధానం

  • కరివేపాకు  పొడి కోసం కొంచెం ముదిరిన కరివేపాకు ఆకుల్ని తీసుకోవాలి. 
  • వాటిని బాగా కడిగి ఆరబెట్టాలి. తర్వాత ఆకులను నూనెలో వేగించి పక్కన పెట్టాలి. 
  • స్టవ్​ పై పాన్ పెట్టి శెనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, ఎండుమిర్చి, జీలకర్రను విడి విడిగా వేగించాలి. కరివేపాకు, ఎండుమిర్చిలను ఒకటి తర్వాత ఒకటి వేసి గ్రైండ్ చేయాలి. 
  • చివరగా వేగించిన పప్పులు, జీలకర్ర, నువ్వులు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి పొడి చేయాలి. 
  • ఈ పొడిని అన్నంలోనే కాదు… ఇడ్లీ, దోశలతోనూ తినొచ్చు. 

ఇవి తింటే వర్షాకాలం ఇమ్యూనిటి పవర్​ పెరుగుతుంది.  సీజనల్​ వ్యాధులు. దగ్గు, జలుడు వంటి వాటికి మంచి ఔషధంగా పనిచేస్తాయి.  ఇవి గాలిసోకని గాజు సీసాల్లో నిల్వ కూడా చేసుకోవచ్చు.  మరి ఇంకెందుకు ఆలస్యం రైనీ సీజన్​ స్టాటయింది.. పైగా అడపా దడపా వర్షాలు కూడా పడుతున్నాయి కదా.. మరి  ఎల్లిపాయ కారం.. కరివేపాకు పొడి ని మీకిచెన్​ లో ఉంచుకోండి..! 

©️ VIL Media Pvt Ltd.