
హైదరాబాద్, వెలుగు: మైనార్టీ విద్యాసంస్థల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను గురువారం సీఎం రేవంత్ రెడ్డి సన్మానించనున్నారు. గ్రూప్-1, 2 అభ్యర్థులతో పాటు ఐఐటీ, జేఈఈ, ఎప్‌సెట్, పది, ఇంటర్ విద్యార్థులు కూడా ఇందులో ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై బుధవారం సెక్రటేరియెట్‌లో మైనార్టీ శాఖ మంత్రి అజారుద్దీన్, ఆ డిపార్ట్‌మెంట్ సలహాదారు షబ్బీర్ ఆలీ రివ్యూ నిర్వహించారు.
విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులు కార్యక్రమానికి హాజరయ్యే అతిథులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ విద్యార్థుల విజయాలు మరెంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయని, ఉన్నత విద్యతో పాటు పోటీ పరీక్షల్లో విజయాలు సాధించే దిశగా వారిని ప్రోత్సహిస్తాయని మంత్రి అజారుద్దీన్ పేర్కొన్నారు.