
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన వినూత్న చిత్రం ‘కొరియన్ కనకరాజు’ బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించిన సందర్భంగా నిర్వహించిన సక్సెస్ సెలబ్రేషన్స్‌కు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ సినిమాలో సత్య చేసిన కామెడీకి ముగ్ధుడైనట్లు చిరంజీవి తెలిపారు. “గాంధీ ఈ సినిమాకి ఇంజనీర్ అయితే, వరుణ్ ఐరన్ పిల్లర్, సత్య కాంక్రీట్ లాంటివాడు. సత్య యాక్టింగ్ నాకెంతో నచ్చింది. ఎటువంటి అడ్డంకులు లేకుండా తనకంటూ ఒక మార్క్ సెట్ చేసుకున్నాడు. ఈ సినిమాను అతని కోసం మళ్ళీ చూడాలనిపిస్తుంది” అన్నారు. అలాగే కథానాయిక రితిక గ్లామర్, ఎనర్జీ చాలా బాగున్నాయని, మురళీధర్ గౌడ్ సహజ నటన సినిమాకు మరింత బలాన్ని ఇచ్చిందని ప్రశంసించారు.
ఇటీవలి కాలంలో చిన్న సినిమాలు థియేటర్లలో ఆడటం లేదని, జనం ఓటీటీలకే పరిమితమయ్యారని వస్తున్న వార్తలను చిరంజీవి కొట్టిపారేశారు. “ఈ ఏడాది సెకండ్ హాఫ్‌లో వరుసగా మంచి సినిమాలు విజయాలు సాధిస్తున్నాయి. ‘చెన్నై లవ్ స్టోరీ’, ‘మా ఇంటి బంగారం’, ‘లేనిన్’.. ఇప్పుడు ‘కొరియన్ కనకరాజు’ వరకు బాక్సాఫీస్ వద్ద మంచి ఫలితాలను అందుకున్నాయి. కొత్తదనంతో కూడిన మంచి కంటెంట్, హెల్దీ ఎంటర్టైన్మెంట్ అందిస్తే ప్రేక్షకులు కుటుంబ సమేతంగా థియేటర్లకు వచ్చి తీరతారని ఈ సినిమాలు నిరూపించాయి” అని అన్నారు.