Reading Time: < 1 minute

లాల్‌ దర్వాజా సింహవాహిని అమ్మవారి హుండీ ఆదాయం ఎంతంటే?

Caption of Image.

హైదరాబాద్ పాతబస్తీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం.. లాల్‌దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు పూర్తయింది.ఆషాఢ మాస బోనాల పండుగ అత్యంత వైభవంగా ముగియడంతో.. దేవాదాయ శాఖ (ఎండోమెంట్) అధికారులు, ఆలయ సిబ్బంది సమక్షంలో అమ్మవారి హుండీలను తెరిచి లెక్కించారు.

ఈ హుండీ లెక్కింపు ద్వారా అమ్మవారికి మొత్తం  6 లక్షల26వేల226 రూపాయల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు.. తమ మొక్కుబడులు చెల్లించుకుని సమర్పించిన కానుకల ద్వారా ఈ ఆదాయం లభించినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.