Reading Time: 2 minutes
Akhil Nrd Wife Megha Controversy Viral News

Akhil NRD Wife Megha Controversy: మలయాళ పాపులర్ యూట్యూబర్, కంటెంట్ క్రియేటర్ అఖిల్ ఎన్ఆర్‌డీ జీవితం ఒక్కసారిగా వివాదాల్లోకి నెట్టబడింది. ఎంతో సంతోషంగా సాగిపోతోందనుకున్న వివాహ బంధం ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో పడింది. అఖిల్ భార్య మేఘ ఆయనను వదిలేసి, ఒక బస్సు కండక్టర్‌తో వెళ్లిపోవడంతో ఈ అంశం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది. ఆ కండక్టర్‌కు ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం రావడంతోనే మేఘ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అఖిల్ వీడియోల ద్వారానే మేఘ సోషల్ మీడియా ప్రపంచానికి పరిచయమైంది. వివాహానికి ముందు లీగల్ రంగానికి చెందిన మేఘ, బేచలర్ ఆఫ్ లాస్ (LLB) డిగ్రీ పూర్తి చేసింది. చదువుకునే రోజుల నుంచే అఖిల్, మేఘల మధ్య ప్రేమ చిగురించింది. కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న ఈ జంట, నవంబర్ 2024లో కుటుంబ సభ్యుల సమక్షంలో సాంప్రదాయబద్ధంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత అఖిల్ ప్రోత్సాహంతోనే మేఘ వ్లాగింగ్ వైపు అడుగులు వేశారు. ఇద్దరూ కలిసి చేసిన లైఫ్‌స్టైల్, కామెడీ వీడియోలకు వీక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. ఆ క్రమంలోనే మేఘ ఇన్స్టాగ్రామ్‌లో ప్రత్యేకంగా ఒక పేజీ ప్రారంభించి, ఫ్యాషన్, బ్యూటీ కంటెంట్‌ను పోస్ట్ చేస్తూ సొంతంగా ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ప్రస్తుతం వీరికి పిల్లలు లేరు.

అయితే, పెళ్లి తర్వాత కూడా మేఘ తన చదువును కొనసాగించాలనుకుంది. భార్య కోరికను గౌరవించిన అఖిల్, ఆమెను ఒక కోర్సులో చేర్పించాడు. ఆ కోర్సు కోసం మేఘ రోజువారీగా బస్సులో ప్రయాణించేది. ఆ ప్రయాణాల్లోనే ఒక లోకల్ బస్సు కండక్టర్‌తో ఆమెకు పరిచయం ఏర్పడి, అది కాస్తా ప్రేమగా మారింది. ఇటీవలే ఆ కండక్టర్‌కు ప్రభుత్వ ఉద్యోగం రావడంతో, మేఘ అతడితో కలిసి వెళ్లాలని నిశ్చయించుకుంది. ఇల్లు వదిలి వెళ్లే సమయంలో మేఘ ఇంట్లోని నగదు, విలువైన ఆభరణాలు, ఇతర కాస్ట్లీ వస్తువులను కూడా తనతో పాటు తీసుకెళ్లినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మొదట భార్య కనిపించకపోవడంతో ఏం జరిగిందో తెలియని అఖిల్, తీవ్ర ఆందోళనకు గురై పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. అయితే, ఆ తర్వాత లభ్యమైన సీసీటీవీ ఫుటేజ్ చూసి దిగ్భ్రాంతికి లోనయ్యాడు. రాత్రి వేళ నైటీ ధరించి, సూట్‌కేసు పట్టుకుని పరుగులు తీస్తూ మేఘ బయటకు రావడం, అక్కడ సిద్ధంగా ఉన్న ఆ కండక్టర్‌తో కలిసి ఆమె వెళ్లిపోవడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఈ సీసీటీవీ దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు, ఈ వివాదంపై తీవ్ర చర్చ నడుస్తున్న వేళ మేఘ సామాజిక మాధ్యమాల్లో ఒక క్లారిటీ వీడియో విడుదల చేసి, ఆ తర్వాత డిలీట్ చేశారని తెలుస్తోంది. అఖిల్‌తో తన వైవాహిక జీవితం కొన్నాళ్లుగా సరిగ్గా లేదని, అతడికి ఇతర యువతులతో సంబంధాలు (extramarital affairs) ఉన్నాయని, ఆ వేధింపుల వల్లే తాను ఇల్లు వదలాల్సి వచ్చిందని మేఘ ఆ వీడియోలో ఆరోపించినట్లు సమాచారం. ఏది ఏమైనా, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఇలా వేరొకరితో వెళ్ళిపోవడంతో అఖిల్ ఎన్ఆర్‌డీ తీవ్ర మనోవేదనకు గురవుతుండగా, ఆయన స్నేహితులు, అభిమానులు ఆయనకు అండగా నిలుస్తున్నారు.