Reading Time: < 1 minute

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో అక్యుమాటికా జీసీసీ 

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: క్లౌడ్ ఆధారిత ఈఆర్‌‌‌‌‌‌‌‌పీ సేవలు అందించే ఐటీ సంస్థ అక్యుమాటికా హైదరాబాద్‌‌‌‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను  ప్రారంభించింది. ఈ కేంద్రం 30 మంది ఉద్యోగులతో మొదలయింది. రాబోయే రోజుల్లో మరికొందరు చేరనున్నారు. అమెరికా, కెనడా, సెర్బియా, శ్రీలంకలో ఈ సంస్థ సేవలు అందిస్తోంది. చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు నూతన ఉత్పత్తులు అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. అపారమైన ఇంజనీరింగ్ నైపుణ్యం ఉండటం వల్ల హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను ఎంచుకున్నట్లు సంస్థ సీఈఓ మిటెన్ మెహతా పేర్కొన్నారు.   

©️ VIL Media Pvt Ltd.