Reading Time: 2 minutes

ఆర్మీలో పర్మనెంట్ ఉద్యోగాలు: మొత్తం 2,615 పోస్టులు.. 10th పాసైన వారికి బంపర్ ఆఫర్!

Caption of Image.

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ (ఏఓసీ) వివిధ విభాగాల్లో సివిలియన్ గ్రూప్-–సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 2,615 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అప్లికేషన్ ప్రక్రియ ఆగస్టు 24న ప్రారంభం కానున్నది. అప్లై చేయడానికి ఆఖరు తేదీ సెప్టెంబర్ 22.

పోస్టు పేరు: సివిలియన్ గ్రూప్–సి

మొత్తం ఖాళీలు: 2615.

విభాగాల వారీగా ఖాళీలు: ట్రేడ్స్​మన్ 1799, ఫైర్ మన్ 508, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (జీఓఏ) 104, మల్టీ– టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) 142, మెటీరియల్ అసిస్టెంట్ 50. 

ఎలిజిబిలిటీ
ట్రేడ్స్​మన్, ఫైర్​మన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్: గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్/ పదోతరగతి పూర్తిచేసి ఉండాలి. 

జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ (జేఓఏ): గుర్తింపు పొందిన బోర్డు నుంచి 12వ తరగతి పూర్తిచేసి ఉండాలి. ఇంగ్లిషులో నిమిషానికి 35 పదాలు టైప్ చేయగలగాలి.

మెటీరియల్ అసిస్టెంట్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. 

వయోపరిమితి
ట్రేడ్స్​మన్ మేట్, ఫైర్​మన్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్: 18 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. 
 జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, మెటీరియల్ అసిస్టెంట్: 18 నుంచి 27 ఏళ్ల మధ్యలో ఉండాలి.  
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ/ ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.

అప్లికేషన్ ప్రారంభం: ఆగస్టు 24. 

లాస్ట్ డేట్: సెప్టెంబర్22.

రాత పరీక్ష: 2026, నవంబర్ (తాత్కాలికం). 

సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

మరిన్ని వివరాలకు వెబ్​సైట్    aocrecruitment.gov.inను సందర్శించండి. 

ఎగ్జామ్ ప్యాటర్న్
ఆఫ్​లైన్ ఆధారిత పరీక్షలో ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్ రూపంలో ఇస్తారు. మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు. 100 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, జనరల్ అవేర్​నెస్ నుంచి 25 మార్కులకు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు, ఇంగ్లిష్ లాంగ్వేజ్ నుంచి 25 ప్రశ్నలు 25 మార్కులకు ఇస్తారు. 
ప్రశ్నపత్రం ఇంగ్లిష్, హిందీ భాషల్లో ఇస్తారు (ఇంగ్లిష్ లాంగ్వేజ్ మినహా). నెగెటివ్ మార్కింగ్ విధానం ఉన్నది. ప్రతి తప్పు సమాధానానికి  0.25 మార్కులు (1/4వ వంతు మార్కులు) కోత విధిస్తారు. 

జేఓఏ పోస్టులు 
జేఓఏ పోస్టులకు అదనంగా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇంగ్లిష్ టైపింగ్ ఎంచుకునే అభ్యర్థులు నిమిషానికి కనీసం 35 పదాలు టైప్ చేయగలగాలి. హిందీ టైపింగ్ ఎంచుకునే అభ్యర్థులు నిమిషానికి కనీసం 30 పదాలు టైప్ చేయాలి. ఈ పరీక్షను కంప్యూటర్‌‌‌‌‌‌‌‌పై ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నిర్వహిస్తారు.  టైపింగ్ టెస్ట్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో సాధించిన మార్కులను తుది మెరిట్ జాబితాకు పరిగణలోకి తీసుకోరు, కానీ టైపింగ్ టెస్టులో అర్హత సాధించడం తప్పనిసరి.

ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్
ట్రేడ్స్​మన్ మేట్
పరుగు పందెం: 1.5 కిలోమీటర్ల దూరాన్ని 6 నిమిషాల్లో పూర్తిచేయాలి.
బరువు మోయడం: 50 కిలోల బరువును ఎత్తుకుని 100 మీటర్ల దూరాన్ని 2 నిమిషాల్లో చేరాలి.

ఫైర్‌‌‌‌‌‌‌‌మన్ 
పరుగు పందెం: 1.6 కిలోమీటర్ల దూరాన్ని 6 నిమిషాల 30 సెకన్లలో పూర్తి చేయాలి.
లాంగ్ జంప్: 2.7 మీటర్ల దూరం దూకాలి.
క్లైంబింగ్: రోప్ క్లైంబింగ్.

 

►ALSO READ | IIT హైదరాబాద్‌లో జాబ్స్.. కేవలం ఆన్‌లైన్ ఇంటర్వ్యూతో సెలెక్షన్.. మిస్సవకండి..

©️ VIL Media Pvt Ltd.