
బిగ్ బాస్ అగ్నిపరీక్ష సీజన్ 2 సందడి మొదలైంది. ఈ షోకు సంబంధించిన ఫ్లేమ్ టూర్‌ను బిగ్ బాస్ టీమ్ గ్రాండ్‌గా నిర్వహిస్తోంది. అగ్నిపరీక్ష అంటే ఏంటో, దాని ద్వారా బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టే అవకాశం ఎలా దక్కుతుందో ప్రజలకు తెలియజేయడమే ఈ టూర్ ఉద్దేశం. విజయనగరంలో ప్రారంభమైన ఫ్లేమ్ టూర్‌కు భారీ స్పందన వచ్చింది. టూర్‌లో భాగంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 విజేత కళ్యాణ్ పడాల అభిమానులను కలిసి సందడి చేశారు.
విజయనగరానికి చెందిన కళ్యాణ్ పడాల బిగ్ బాస్ హౌస్‌లో తన క్రమశిక్షణ, ఆటతీరుతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చివరకు సీజన్ 9 విజేతగా నిలిచి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. ఫ్లేమ్ టూర్‌లో భాగంగా కళ్యాణ్‌ను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. తన విజయానికి విజయనగరం ప్రజలు, అభిమానులు అందించిన ప్రేమే కారణమన్నాడు కళ్యాణ్.
ఇక ఫ్లేమ్ టూర్ విశాఖపట్నానికి చేరుకోగా బిగ్ బాస్ 9 ఫైనలిస్ట్ డెమాన్ పవన్ సందడి చేశారు. అగ్నిపరీక్ష అంటే కేవలం టాస్కులు కాదని, జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలా చేసే గొప్ప వేదిక అని చెప్పారు డెమోన్. బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లాలనే కలను నిజం చేసుకోవడంతో పాటు మనలోని ఫైర్‌ను సజీవంగా ఉంచే అవకాశం ఇదని వివరించారు.
అగ్నిపరీక్ష సీజన్ 2 ఆగస్టు 15 నుంచి ప్రారంభం కానుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సందడి పెంచేందుకు బిగ్ బాస్ టీమ్ ఫ్లేమ్ టూర్‌ను నిర్వహిస్తోంది. కళ్యాణ్ పడాల, డెమాన్ పవన్ పాల్గొనడంతో అభిమానుల్లో జోష్ మరింత పెరిగింది. ఇప్పటికే విజయనగరం, విశాఖలో టూర్‌కు వచ్చిన రెస్పాన్స్ చూస్తుంటే అగ్నిపరీక్ష సీజన్ 2పై క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థమవుతోంది. ఈసారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎవరు అడుగుపెడతారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కొనసాగుతోంది.
A Commoner. A Challenger. A Celebrity.⭐
Kalyan Padala🔥
సామాన్యుడి ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పాడు!
ఇప్పుడు మీ వంతు.
అగ్నిపరీక్షను జయించి… మీ కలను నిజం చేసుకోండి!#BiggBoss10Agnipariksha Streaming From Aug 15th on #StarMaa & #JioHotstar pic.twitter.com/uzd1T4kXd9— Starmaa (@StarMaa) August 1, 2026
‘అగ్నిపరీక్ష’ హీట్.. 70 మందిలో టాప్ 15!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు ముందే ‘అగ్నిపరీక్ష’తో సందడి మొదలైంది. రెండో సీజన్ ఆగస్టు 15 నుంచి ప్రసారం కానుంది. వేల దరఖాస్తుల్లో నుంచి సుమారు 70 మందిని షార్ట్‌లిస్ట్ చేసి.. టాస్కులు, ఇంటర్వ్యూల ద్వారా టాప్ 15 మందిని ఎంపిక చేయనున్నట్లు సమాచారం. వీరిలో 5-6 మందికి బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ దక్కే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈసారి అభిజీత్, బిందు మాధవి, నవదీప్ జడ్జీలుగా కనిపించనుండగా.. శ్రీముఖి తన ఎనర్జిటిక్ కామెంట్స్‌తో షోకి మరింత హీట్ పెంచనుంది. రైతు బిడ్డ కేటగిరీలో ఓ అమ్మాయికి అవకాశం ఇవ్వడంతో పాటు, రివర్స్ రైటింగ్ వంటి ప్రత్యేక టాలెంట్ ఉన్న కంటెస్టెంట్లకు కూడా ఛాన్స్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.