
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఫుకెట్, ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో కుదుపుల ఘటనపై ఎయిర్ ఇండియా సీఈవో కు నోటీసులు చేసింది డీజీసీఏ. ఘటనపై వివరణ ఇవ్వాలని కోరింది.
ఆగస్టు 4న ఫుకెట్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమనంలో ఒక్కసారిగా కుదుపులతో దాదాపు 300 ఫీట్లకు దిగువకు విమానం వెళ్లడంతో విమానంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్యాసింజర్లు ఒకరిపై ఒకరు పడటంతో పలువురికి గాయాలయ్యాయి. అయితే విమానం తిరిగి పుంజుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో(AAIB) విచారణచేపట్టింది.
ఈ ఘటనకు గల కారణాలపై అనేక వార్తలు ప్రచారంలోఉన్నాయి. విమానం నడుపుతున్న ఇద్దరు పైలట్లలో ఒకరు డోపింగ్ టెస్ట్ ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. మరోవైపు విమానంలో తలెత్తిన టెక్నికల్ సమస్యలు మరో కారణంకావచ్చని, డీజీసీఏవిచారణలో నిజాలు బయటికి వస్తాయని అధికారులు చెబుతున్నారు.