Reading Time: < 1 minute

బెంగాల్ సీఎం సువేందు అధికారి హెలికాఫ్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్

Caption of Image.

కోల్‎కతా: పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తోన్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అత్యవసరంగా ల్యాండ్ అయ్యింది. పశ్చిమ మేదినీపూర్‌లోని కేశ్‌పూర్‌కు ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హెలికాప్టర్ సురక్షితంగా ల్యాండ్ కావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

అధికారుల వివరాల ప్రకారం.. స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ స్మారక కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం (ఆగస్ట్ 11) సీఎం సువేందు అధికారి దుమ్‌దుమ్ నుంచి హెలికాప్టర్‌లో పశ్చిమ మేదినీపూర్‌లోని కేశ్‌పూర్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ హెలికాప్టర్‏ను కోలఘాట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 

అనంతరం సీఎం సువేందు అధికారి రోడ్డు మార్గంలో కేశ్‌పూర్‌లో జరగాల్సిన కార్యక్రమానికి వెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన చోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు బ్యాడ్ వెదరే కారణమా లేక మరేదేమైనా రీజన్ ఉందా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. 

 

©️ VIL Media Pvt Ltd.