Reading Time: < 1 minute
ఫ్రీ.. ఫ్రీ.. కోళ్ళను ఎత్తుకెళ్లేందుకు బస్తాలే తీసుకొచ్చారు.. అసలేం జరిగిందో తెలుసా..?

​తిరుపతి జిల్లా చంద్రగిరి వద్ద కోళ్లను ఎత్తుకెళ్లేందుకు జనం పోటీపడ్డారు. ఫ్రీగా దొరికిన కోళ్లను కోసుకుని వెజ్ తినేందుకు ఎగబడ్డారు. భాకరాపేట ఘాట్‌లో జరిగిన ప్రమాదంతో వందలాది కోళ్లు చనిపోయాయి.. ఇది జనానికి లక్కీ ఛాన్స్‌గా మారింది. పీలేరు నుంచి తిరుపతి వైపు వస్తున్న కోళ్ల లారీ ఘాట్ రోడ్డుపై అదుపుతప్పి బోల్తా పడింది. లారీ బోల్తా పడటంతో రోడ్డుపై కోళ్లు చెల్లాచెదురుగా పడిపోయాయి. చాలా కోళ్లు చనిపోగా.. కొన్ని కొన ఊపిరితో ఉన్నాయి. ఇది గమనించిన ఘాట్ రోడ్డులో ప్రయాణం చేస్తున్న వాహనదారులు పరుగులు తీశారు…

లారీలోని కోళ్లు, ప్రమాదంలో చనిపోయిన కోళ్లను ఎత్తుకు వెళ్లేందుకు ఎగబడ్డారు. కోళ్ల లారీ ప్రమాదానికి గురై వందలాది కోళ్లు రోడ్డు పక్కన పడేశారని తెలుసుకున్న జనం అక్కడికి చేరుకున్నారు. ఘటన స్థలానికి బైకులు, ఆటోల్లో చేరుకొని కోళ్లను ఎత్తుకెళ్లేందుకు పోటీపడ్డారు. చనిపోయిన కోళ్లు, కొనఊపిరితో ఉన్న కోళ్లను సమీప గ్రామస్తులు, వాహనదారులు తీసుకుని వెళ్లారు.

వీడియో చూడండి..

అయితే.. వాహనం ప్రమాదనికి గురైందన్న సోయి లేకుండా.. ఇలా కోళ్లను ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది.. వీడియోలు వైరల్ అవ్వడంతో ఇదేం పద్దతి అంటూ జనం ముక్కున వేలేసుకుంటున్నారు.