
జీడిమెట్లలో ఘోరం జరిగింది. ఆర్టీసీ డిపోలో డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బ్రేక్ సెట్టింగ్ చేస్తున్న మెకానిక్ మృతి చెందాడు. మంగళవారం ( ఆగస్టు 11 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..జీడిమెట్ల డిపోలో ఫస్ట్ షిఫ్ట్ మెకానిక్ గా పని చేస్తున్నాడు సంతోష్.ఇవాళ సంతోష్ డ్యూటీలో ఉండగా… ఓ డ్రైవర్ బ్రేక్ సెట్టింగ్ చేయమని సంప్రదించాడు.
ఈ క్రమంలో సంతోష్ బ్రేక్ సెట్టింగ్ చేసి బయటకు వస్తుండగా…ప్రమాదవశాత్తు బస్సును ముందుకు నడిపాడు డ్రైవర్. దీంతో బస్సు టైర్లు సంతోష్ పైనుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంతోష్ మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.