Reading Time: 2 minutes

మీకు.. మన్మోహన్ సింగ్‎కు ఎంతో తేడా: మోడీ సర్కార్‏పై సోనియా ఆగ్రహం

Caption of Image.

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‎కు న్యాయస్థానం క్లీన్ చిట్ ఇవ్వడంపై కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ స్పందించారు. ఈ తీర్పుతో మన్మోహన్ సింగ్‎పై జరిగిన రాజకీయ కుట్ర ముగిసిందని, ఆయన నిష్కళంకమైన నిజాయితీ నిరూపితమైందని పేర్కొన్నారు. మన్మోహన్ సింగ్‌ను ఒక నిశ్శబ్ద, అత్యంత ప్రతిభావంతుడైన, ప్రభావవంతమైన ప్రధానిగా చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అన్నారు.

ఈ సందర్భంగా ఆమె కేంద్రంలోని మోడీ సర్కార్‎పై విరుచుకుపడ్డారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి.. ప్రస్తుత మోడీ ప్రభుత్వ పనితీరుకు ఎంతో వ్యత్యాసం ఉందన్నారు. మన్మోహన్ సింగ్ ప్రజా పాలన సాగిస్తే.. మోడీ నియంత మాదిరిగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మోడీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలను విపక్ష నేతలపై ఒత్తిడి తెచ్చేందుకు దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. 

గతంలో పార్లమెంట్‌లో మన్మోహన్ సింగ్‌పై మోడీ చేసిన రెయిన్‌కోట్ వ్యాఖ్యలు పార్లమెంటరీ చరిత్రలోనే అత్యంత దిగజారుడు క్షణంగా అభివర్ణించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవినీతిపరులుగా కనిపించే నేతలు బీజేపీలో చేరగానే రాత్రికి రాత్రే క్లీన్ అయిపోతారని సెటైర్ వేశారు. కొందరికి మంత్రి పదవులు కూడా దక్కుతాయని ఎద్దేవా చేశారు. 

మన్మోహన్‎కు క్లీన్ చిట్:

బొగ్గు కుంభకోణం కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‎కు క్లీన్ చిట్ లభించింది. మరణించిన రెండేళ్ల తర్వాత ఈ కేసులో ఆయనను నిర్దోషి అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ బొగ్గు శాఖను నిర్వహించినప్పుడు ఒడిశాలోని తలబీరా బొగ్గు బ్లాక్ను అక్రమంగా హిండాల్కో ఇండస్ట్రీస్కు కేటాయించారన్న ఆరోపణలతో కేసు నమోదు అయింది. అప్పట్లో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

2015లో వెలుగు చూసిన ఈ కేసులో సీబీఐకు విచారణ ఆదేశించారు. పారిశ్రామిక వేత్త కుమార్ మంగళం బిర్లా, మాజీ బొగ్గు శాఖ కార్యదర్శి పీసీ పరాఖ్‎లపై సీబీఐ చార్జీ షీట్ దాఖలు చేయగా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‎ను కూడా నిందితుడిగా పిలిపించింది సుప్రీంకోర్టు.
ఈ విషయంతో ట్రయల్ కోర్టు కేసును పరిగణనలోకి తీసుకోవడంలో పొరపాటు జరిగిందని, మన్మోహన్ సింగ్ కోర్టు సమన్లను సుప్రీంకోర్టు లో సవాల్ చేశారు.

అయితే 2015 ఏప్రిల్‎లో సమన్లపై స్టే విధించిన సుప్రీంకోర్టు సింగ్ విచారణ ఎదుర్కొనకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అప్పీలు పదేళ్లకు పైగా పెండింగ్లో ఉండగా, 2024 డిసెంబర్ లో మన్మోహన్ సింగ్ మరణించిన అనంతరం సుప్రీంకోర్టు ఈ కేసును కొట్టివేసి, మాజీ ప్రధానిపై విచారణను ముగించింది. 

 

©️ VIL Media Pvt Ltd.