
Ration Card eKYC: రేషన్ కార్డు వినియోగదారులకు గుడ్ న్యూస్. ఇప్పుడు రేషన్ eKYC (ఈ-కేవైసీ) ప్రక్రియ కోసం రేషన్ షాపులకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీ వద్ద ఉన్న స్మార్ట్‌ఫోన్ ద్వారానే, ఆధార్ నంబర్, OTP సాయంతో చాలా సులభంగా eKYC ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ఈ సులువైన విధానాన్ని ఎలా పూర్తి చేయాలో కింద వివరించిన స్టెప్స్ ద్వారా తెలుసుకోండి:
eKYC పూర్తి చేయడానికి కావలసిన మొబైల్ యాప్‌లు:
1. ప్లే స్టోర్ (Play Store) నుండి స్టేట్ eKYC APP (State eKYC App) ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2. అదే ప్లే స్టోర్ నుండి ఆధార్ ఫేస్ RD APP (Aadhaar Face RD App) ని కూడా డౌన్‌లోడ్ చేసుకోండి.
3. యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్టేట్ (రాష్ట్రం) వివరాలు అడుగుతుంది. అందులో తెలంగాణ అని సెలెక్ట్ చేసుకోవాలి.
ప్రక్రియ ఆన్‌లైన్‌లో చేసే విధానం:
1. ఆధార్ నంబర్ నమోదు: ముందుగా మీ 12 అంకెల ఆధార్ నంబర్ నమోదు చేసి ‘NEXT’ పై క్లిక్ చేయాలి.
2. OTP వెరిఫికేషన్: ఆధార్‌తో లింక్ అయిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన OTP ని ఎంటర్ చేసి ‘NEXT’ నొక్కండి.
3. eKYC స్టేటస్ చెక్: స్క్రీన్ పై మీ వివరాలు కనిపిస్తాయి. కింద మీ eKYC స్టేటస్ చూపిస్తుంది.
4. ఒకవేళ మీ eKYC ఇప్పటికే పూర్తయి ఉంటే గ్రీన్ టిక్ (
) చూపిస్తుంది.
5. ఒకవేళ పూర్తికాకపోతే Empty గా లేదా డ్యాష్ (—) సింబల్ చూపిస్తుంది.
ఫేస్ eKYC ప్రక్రియ:
- eKYC కానట్లయితే కింద ఉన్న ‘FACE EKYC’ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- నిబంధనలను ACCEPT చేసిన తర్వాత కెమెరా/ఫోటో ఆప్షన్ ఓపెన్ అవుతుంది.
- ఫేస్ స్కాన్ (Face Scan): మీ ఫోన్ ఫ్రంట్ కెమెరా ముందు ముఖం ఉంచి, కళ్ళు ఆర్పడం (Eyes Blink) ద్వారా ఫేస్ రీడింగ్ ప్రక్రియ పూర్తవుతుంది
సక్సెస్ మెసేజ్:
ఫేస్ స్కాన్ విజయవంతం కాగానే eKYC గ్రీన్ సింబల్ కనిపిస్తుంది. ఆ సింబల్ వస్తే మీ eKYC పూర్తయినట్లే. ఇలామీ eKYC ని పూర్తి చేసుకుని, రేషన్ ప్రయోజనాలను నిరంతరాయంగా పొందండి.
ఇది కూడా చదవండి: House Construction: 1000 చదరపు అడుగుల ఇంటి నిర్మాణంలో కేవలం స్లాబ్ ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? పూర్తి లెక్కలివే..!
ఇవి కూడా చదవండి: SBI Insurance: ఏడాదికి రూ.3 వేలు కడితే చాలు రూ.60 లక్షలు.. ఎస్‌బీఐలో అదిరిపోయే స్కీమ్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి