
ఈ రోజుల్లో పిల్లలను సాదాలంటే కత్తిమీద సాములాగా పేరెంట్స్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో చిల్డ్రన్స్పెంచే విషయంలో అవగాహన లేక పేరెంట్స్ తప్పటడుగు వేస్తుంటారు. ప్రతి దానికి పిల్లలపూ చిర్రు బుర్రులాడితే వాళ్లు మనతో సరిగా మాట్లాడరు.. పైగా ఇన్ ఫీరియారిటీ ఫీలవుతారు. ఇదే వాళ్ల జీవితానికి పెద్ద సమస్యగా మారుతుంది. మరి పిల్లలతో ఎలా మెలగాలి.. వారి పట్ల పేరెంట్స్ ఎలా ప్రవర్తించాలి.. చైల్డ్ కేర్ ఎక్స్ పర్ట్స్ సలహాల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. .
పిల్లలు నలుగురితో కలిసిపోవాలంటే.. ఇతరులతో పోల్చడం.. మానేయాలి. చిన్నారుల్లో ఎమోషన్స్, ఇన్ఫీరియారిటీ పీలింగ్ ఎక్కువగా ఉంటుందని చైల్డ్ కేర్ ఎక్స్ పర్ట్స్ అంటున్నారు. ఇతరులతో పోల్చడం, వెక్కిరించటం, పేర్లు పెట్టడం, మిగతా పిల్లల ముందు తక్కువ చేసి మాట్లాడటం మంచిది కాదు. ప్రతి మనిషికి తమదంటూ ఒక స్పెషల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది.
ప్రతీదానినీ “ఇలాగే చేయాలి” అని కట్టడి చేయాల్సిన పని లేదు. కాబట్టి, ఇతరులతో పోల్చకూడదు. మిగిలిన పిల్లలతో పోల్చి నువ్వు ఎందుకూ పనికిరావు అన్న ఒక మాట వాళ్లలో ఇన్ ఫీరియారిటీ ఫీలింగ్ ని పెంచుతుంది. అలాగే పిల్లల్లో ఎవర్నో ఒకర్ని ఎక్కువగా ఇష్టపడటం మిగిలిన వారిని అంతగా ఇష్టపడకపోవడం అన్నది కూడా చాలా తప్పు. పిల్లల మధ్య తేడా చూపించడం వాళ్లను డిప్రెషన్లో పడేస్తుంది.
మనం చెప్పింది. వాళ్లు వింటున్నట్టే వాళ్లు చెప్పింది కూడా మనం ఓపిగ్గా వినాలి. వాళ్లు మనసులో ఏమనుకుంటున్నారో వాళ్లు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకోవాలి. ఏ విషయమైనా చెప్పగలిగే స్వేచ్ఛ పిల్లలకి ఇవ్వాలి. అప్పుడే వాళ్లు మనతో ఫ్రెండ్లీగా ఉంటారు. లేదంటే అన్ని విషయాలు తమలో దాచుకుని సమస్యకు ఏ సొల్యూషన్ దొరక్క తోచిన నిర్ణయాలతో సమస్యల్లో పడతారు. అందుకే పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.