Reading Time: < 1 minute

TCS ఇంటర్న్‌గా మొదలు.. టాటా సామ్రాజ్యానికి అధిపతిగా ఎదిగిన చంద్రశేఖరన్ జర్నీ

Caption of Image.

1963లో తమిళనాడులోని సాధారణ రైతు కుటుంబంలో జూన్ 2న జన్మించారు ఎన్ చంద్రశేఖరన్. ఆరుగురి సంతానంలో చిన్నవాడైన ఆయన తమిళ మీడియంలో చదుకునేందుకు 3 కిలోమీటర్లు రోజూ నడిచి వెళ్లేవాడు. చంద్రశేఖరన్ సోదరుల్లో ఒకరు మురుగప్పా గ్రూప్ ఫైనాన్స్ డెరెక్టర్ గా పనిచేశారు. మరో సోదరుడు ఎన్ గణపతి సుబ్రహ్మణ్యం టాటా కమ్యూనికేషన్స్ కంపెనీకి ఛైర్మన్ గా 2025లో ఎంపికయ్యారు. కోయంబత్తూరులో ఎంసీఏ పూర్తి చేసిన చంద్రశేఖరన్ 1986లో తిరుచిరపల్లిలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ఆ తర్వాత 1987లో టీసీఎస్ కంపెనీలో ఒక సాధారణ ఇంటర్న్‌గా ఉద్యోగ ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. 

అలా టీసీఎస్ కంపెనీలో అంచలంచలుగా ఎదిగి ప్రస్తుతం టాటా గ్రూప్ దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యానికి ఛైర్మన్ స్థాయి వరకూ ఎదిగారు. 2017లో పార్సీ కుటుంబానికి చెందని తొలి వ్యక్తిగా టాటా గ్రూప్ బాధ్యతలు చేపట్టారు సైరస్ మిస్త్రీ వివాదం తర్వాత. రతన్ టాటాకు అత్యంత నమ్మకస్తుడిగా ఉన్న చంద్రశేఖరన్ టీసీఎస్ ని అభివృద్ధి పదంలో నడిపించి 2009లో దానికి సీఈఓగా పనిచేశారు. ఛైర్మన్ పదవికి చేరుకున్నప్పటికీ మిస్త్రీ చేసిన లీగర్ బ్యాటిల్ సుప్రీం కోర్టు తీర్పుతో మెుత్తానికి 2021లో ముగిసింది. తనను తొలగించాలని మిస్త్రీ ప్రయత్నించినప్పటికీ ఆ సమయంలో కూడా కంపెనీని అభివృద్ధిలో ముందుకు నడిపించారు చంద్రశేఖరన్. 

చంద్రశేఖరన్ హయాంలోనే టాటాల చేతికి ఎయిర్ ఇండియా వచ్చి చేరింది 2022లో. ఎయిర్ లైన్స్ నేషనలైజేషన్ అయిన 69 ఏళ్లకు తిరిగి దాని ఒరిజినల్ ఓనర్ చేతికి వచ్చింది. ఈ కంపెనీని దాదాపు 18 వేల కోట్లు వెచ్చించి టాటా గ్రూప్ సొంతం చేసుకుంది. ఇందులో సంస్థకు ఉన్న రూ.15వేల 300 కోట్ల రుణాలను ప్రభుత్వం నుంచి టాటాలకు చెందిన టలాసే ప్రైవేట్ లిమిటెడ్ టేకోవర్ చేసింది. ఇది టాటా సన్స్ కి చెందిన అనుబంధ సంస్థ. దీని కొనుగోలు తర్వాత చంద్రశేఖరన్ అత్యంత క్లిష్టమైన ఎయిర్ ఇండియా, విస్తారా, ఎయిర్ ఏషియా మెర్జర్ పూర్తి చేశారు. ఇదే కాకుండా సెమికండక్టర్ తయారీ, బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ, హైటెక్ ఇన్ ఫ్రా, ఏఐ వంటి అనేక వ్యాపారాల్లోకి టాటా గ్రూప్ ని విస్తరించారు ఆయన. 

©️ VIL Media Pvt Ltd.