
MI vs PBKS: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026లో నేడు అసలైన మజా షురూ కానుంది! ఒకవైపు వరుస విజయాలతో ‘అన్‌స్టాపబుల్’గా దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్ (PBKS), మరోవైపు తన సొంత గడ్డపై ఫామ్ కోసం వెతుకుతున్న ముంబై ఇండియన్స్ (MI). ఈ రోజు రాత్రి ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ గత ఏడాది క్వాలిఫైయర్– 2 పోరును గుర్తుకు తెస్తోంది.
పిచ్ రిపోర్ట్:
వాంఖడే పిచ్ ఎప్పుడూ బ్యాటర్లకు స్వర్గధామం.. ఈ సీజన్‌లో ఇక్కడ జరిగిన గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఇరు జట్లు 220 పరుగుల మార్కును దాటాయి. గత మ్యాచ్‌లో ఇక్కడ 462 పరుగులు నమోదయ్యాయి. ఈ రోజు కూడా స్టేడియంలో బౌండరీల వర్షం కురిసే అవకాశం ఉంది. ఇక్కడ ఛేజింగ్ చేయడం సులభం కాబట్టి, టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
విజేత ఎవరంటే!:
ప్రస్తుత ఫామ్ ప్రకారం పంజాబ్ కింగ్స్ (PBKS) గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని పంజాబ్ జట్టు ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. పంజాబ్ ప్రస్తుతం 3 విజయాలతో 3వ స్థానంలో ఉండగా, ముంబై కేవలం ఒక్క విజయంతో 9వ స్థానంలో ఉంది. ఈ రోజు పంజాబ్ గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకునే అవకాశం ఉంది.
►ALSO READ | Humanoid Robot: ఉసేన్ బోల్ట్కి పోటీగా రోబో.. 100 మీటర్ల రికార్డు బ్రేక్ చేసే దిశగా పరుగు
ముఖ్యమైన ఆటగాళ్లు:
సూర్యకుమార్ యాదవ్: పంజాబ్‌పై సూర్యకు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు వారిపై 606 పరుగులు చేశాడు (స్ట్రైక్ రేట్ 156.58). వాంఖడేలో అతని స్ట్రైక్ రేట్ 187.50గా ఉండటం విశేషం. నేటి మ్యాచ్‌లో అతను టాప్ స్కోరర్‌గా నిలిచే అవకాశం ఉంది.
శ్రేయస్ అయ్యర్: పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. 4 మ్యాచ్‌ల్లో 137 పరుగులు చేశాడు. బుమ్రా బౌలింగ్‌లో అయ్యర్‌కు మంచి రికార్డు ఉంది (కేవలం ఒకసారి మాత్రమే అవుట్ అయ్యాడు).
తుది జట్ల అంచనా:
ముంబై ఇండియన్స్: ర్యాన్ రికెల్టన్, క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా.
ఇంపాక్ట్ ప్లేయర్: అశ్వని కుమార్
పంజాబ్ కింగ్స్: ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), కూపర్ కానలీ, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్లెట్, వైశాఖ్ విజయ్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్.
ఇంపాక్ట్ ప్లేయర్: యుజ్వేంద్ర చాహల్