
వడోదర: మహిళల ప్రీమియర్ లీగ్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే టేబుల్‌లో ప్రథమ స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫైనల్స్‌కి దూసుకెళ్లింది. నేడు (జనవరి 30) ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన గుజరాత్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించే అవకాశం ఉంది. గుజరాత్ ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా.. ముంబై జట్టు ఆరు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. కానీ నెట్ రన్ రేటులో గుజరాత్ కంటే ముంబై మెరుగ్గా ఉంది. ముంబై నెట్ రన్‌రేట్ +0.146గా ఉండగా.. గుజరాత్ -0.271గా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం ఇరు జట్లకు కీలకంగా మారింది.
తుది జట్లు:
గుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ (కీపర్), సోఫి డివైన్, అసుష్క శర్మ, ఆష్లీ గార్డెనర్(కెప్టెన్), జార్జియా వేర్‌హామ్, భారతీ ఫుల్మాలి, కనికా అహుజా, కష్వీ గౌతమ్, తనూజా కన్వర్, రేణుకా సింగ్ ఠాకూర్, రాజేశ్వరి గయక్వాడ్.
ముంబై ఇండియన్స్: హేలీ మాథ్యూస్, సజీవన్ సజన, నాట్ స్కివర్-బ్రంట్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), అమంజోత్ కౌర్, అమేలియా కెర్, రహిలా ఫిర్దౌస్(కీపర్), సంస్కృతి గుప్తా, వైష్ణవి శర్మ, షబ్నిమ్ ఇస్మాయిల్, పూనమ్ ఖేమ్నార్.