Reading Time: < 1 minute

టి-20 ప్రపంచకప్‌లో సెంచరీ సాధించిన ఏకైక భారత క్రికెటర్ సురేష్ రైనా. 2010 టి-20 ప్రపంచకప్‌లో వెస్టిండీస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రైనా 85 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 101 పరుగులు చేశాడు. అయితే తన తర్వాత టి-20 ప్రపంచకప్ చరిత్రలో సెంచరీ చేసే ఆటగాడు ఎవరో రైనా వెల్లడించాడు. అయితే అది విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ, భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాదు.. టీం ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్.

ఈసారి ప్రపంచకప్‌లో సెంచరీ సాధించే సత్తా సంజూ శాంసన్‌కి మాత్రమే ఉందని రైనా అభిప్రాయపడ్డాడు. ‘‘సంజూ ఓపెనింగ్ బ్యాటర్. సెంచరీ చేయగలిగే సత్తా అతడికి ఉంది. ఇప్పటికే అంతర్జాతీయ టి-20ల్లో అతడి పేరిట రెండు శతకాలు ఉన్నాయి. సౌతాఫ్రికా మీద సంజూ రెండు సెంచరీలు చేశాడు. ఇక సంజూతో పాటు ఈసారి అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లు ఈ జాబితాలో చేరే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే నా ఓటు సంజూకే’’ అని రైనా వివరించాడు. అయితే సంజూ విషయానికొస్తే.. ప్రస్తుతం అతడు పేలవమైన ప్రదర్శన చేస్తున్నాడు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి-20 సిరీస్‌లో నాలుగు మ్యాచుల్లో 10, 6, 0, 24 పరుగులు చేశాడు. ఈ తరుణంలో రైనా, సంజూకి మద్దతుగా నిలవడం విశేషం.