
హైదరాబాద్: పోలీసు అధికారులపై బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు నిరాధారం అని ఐపిఎస్ అధికారుల సంఘం ఆరోపించారు. కౌశిక్ రెడ్డి తీరును తెలంగాణ ఐపిఎస్ లు ఖండించారు. మనోభావాలను దెబ్బతీసేలా కౌశిక్ రెడ్డి వ్యవహరించారని, ఇది సివిల్ సర్వీసెస్ అధికారుల వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటమేనని విమర్శించారు. గురువారం నిబంధనలకు అనుగుణంగానే స్థానిక పోలీసులు నడుచుకున్నారని అన్నారు. కౌశిక్ రెడ్డి బహిరంగ క్షమాపణలు చెప్పాలని తెలంగాణ ఐపిఎస్ అధికారుల సంఘం సూచించారు.