Reading Time: < 1 minute

హైదరాబాద్: రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘రాజాసాబ్’. హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను దర్శకుడు మారుతి తెరకెక్కించారు. నిజానికి ఈ సినిమా గతేడాది డిసెంబర్‌లో విడుదల కావాల్సింది. కానీ, అనుకోని కారణాల వల్ల వాయిదా పడింది. చివరకు ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న విడదలైంది. అయితే ఈ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. అయితే తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్‌కి పండుగలాంటి వార్త వచ్చింది. ‘రాజాసాబ్’ ఒటిటిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జియోహాట్‌స్టార్‌లో ఫిబ్రవరి 6 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. దీంతో విడుదల నెల గడవక ముందే రాజాసాబ్ చిత్రం ఓటటిలోకి వచ్చేస్తోంది.