Reading Time: < 1 minute

తిరువణ్ణామలై: తమిళనాడులోని తిరువణ్ణామలైలోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర స్వామి ఆలయం వెనుక వైపు 2,668 అడుగుల ఎత్తైన అన్నామలై గిరి ఉంది. చాలా మంది భక్తుల పౌర్ణమి రోజు ఈ గిరి చుట్టు 14 కి.మీ.లు ప్రదిక్షణ చేస్తారు. అయితే ఈ కొండ ఎక్కడానికి మాత్రం అటవీ శాఖ అధికారులు నిషేధం విధించారు. ఈ నిబంధనను బుల్లితెర నటి అర్చనా రవిచంద్రన్ పట్టించుకోలేదు. అనుమతి లేకుండా కొండ ఎక్కి ఫోటోలు తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీంతో అటవీ శాఖ అధికారులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై దర్యాప్తు చేశారు. అర్చనా రవిచంద్రన్‌‌తో పాటు నటుడు అరుణ్ ప్రసాద్ కూడా కొండపైకి వెళ్లారని తెలిసింది. దీంతో అధికారులు ఇద్దరికి రూ.5 వేల చొప్పున జరిమానా విధించి వారిని హెచ్చరించి పంపారు.