Reading Time: < 1 minute

హైదరాబాద్: క్రికెట్ మ్యాచ్‌ల కోసం ఐసిసితో గూగుల్ జత కడుతుందని సుందర్ పిచాయ్ తెలిపారు. తన ఎక్స్‌లో సుందర్ పిచాయ్ పోస్టు చేశారు. క్రికెట్‌ను మరింత లోతుగా విశ్లేషించేందుకు ప్రయత్నం చేస్తామని పిచాయ్ పేర్కొన్నారు. ప్రత్యక్ష మ్యాచ్‌ల వీడియో, ఆడియో వ్యాఖ్యానాన్ని అడ్వాన్స్‌డ్ ఎఐ జెమిని 3 ప్రో విశ్లేషించనుందని చెప్పారు. క్రికెట్ అభిమానులు మ్యాచ్‌లను మరింత అస్వాదించేందుకు వీలుపడనుందన్నారు. మ్యాచ్‌లకు సంబంధించిన వీడియోలను ఆప్‌లోడ్ చేసిన తరువాత జెమిని కీలక ఆటగాళ్లను గుర్తించనుంది. గూగ్లీతో జటకట్టనున్న గూగుల్ అని క్యాప్షన్ ఇచ్చాడు.