Reading Time: < 1 minute

టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్‌మీడియాలోనూ అతడికి పెద్ద ఎత్తున ఫాలోవర్లు ఉన్నారు. కోహ్లీ ఒక్క పోస్ట్ పెడితే చాలా క్షణాల్లో అది వైరల్ అవుతుంది. లక్షల్లో లైకలు, వేలల్లో షేర్లు జరుగుతాయి. అయితే ఉన్నపళంగా కోహ్లీ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఒక్కసారిగా కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ డిలీట్ అయింది.

శుక్రవారం అర్థరాత్రి సమయంలో కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అభిమానులకు కనిపించలేదు. దీంతో అభిమానులంతా చాలా టెన్షన్ పడ్డారు. 274 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఖాతా కనిపించకుండా పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో కొన్ని గంటలపాటు అంతా టెన్షన్ పడ్డారు. అయితే కొంత సమయం తర్వాత కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా తిరిగి యాక్టివేట్ అయింది. పాత పోస్టులు, ఫాలోవర్ల సంఖ్య యథాతథంగా ఉంది. అయితే ఇది హ్యాకర్లు చేసిన పనా.. లేక మరేదైనా కారణం ఉందా.? అనే విషయంలో స్పష్టత లేదు.