
హైదరాబాద్: స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణలో తమ వివరణ ఇచ్చామని బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తెలిపారు. అధికార దుర్వినియోగం చేస్తున్న అధికారులను వదిలిపెట్టేది లేదు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధిని అయిన తనను అధికారులు ఇబ్బంది పెట్టారని, తన అనుచరులతో మినీ మేడారం జాతరకు వెళ్తుంటే అడ్డుకున్నారని కౌశిక్ రెడ్డి విమర్శించారు. తన కుటుంబంతో మాత్రమే వెళ్లాలని కండీషన్లు పెట్టారని, దేవుడి గద్దెల వద్ద ఉన్న మమ్మల్ని ఈడ్చుకు వెళ్లారని మండిపడ్డారు. సిపి చేసిన పనులకు తన రక్తం మరుగుతోందని, గురువారం వీణవంకలో పోలీసులు తన పట్ల వ్యవహరించిన తీరుపై స్పీకర్ కు ఫిర్యాదు చేశానని అన్నారు. ఓవరాక్షన్ చేసిన సిపి ఇతర పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదని, సిపి సిఐ, ఎస్ఐ ప్రివిలైజ్ మోషన్ వేశానని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.