
ఏఐ లవ్ స్టోరీ చిత్రం ద్వారా తన వ్యక్తిత్వ గోప్యతా హక్కులు ఉల్లంఘించబడ్డాయని ఆరోపిస్తూ నటుడు అకీరా నందన్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివాదం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో హాట్ టాపిక్‌గా మారింది. ఏఐ లవ్ స్టోరీ సినిమాలో తన ముఖ కవళికలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఏఐ మార్ఫింగ్ ద్వారా డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి క్రియేట్ చేశారని అకీరా తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాతో పాటు YouTube, Instagram, Facebook, X వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో తన పేరుతో ఉన్న నకిలీ ప్రొఫైల్ పేజీలను తొలగించాలని కూడా కోర్టును అభ్యర్థించారు.
మరిన్ని వీడియోల కోసం :