
మనతెలంగాణ/హైదరాబాద్ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్లు దాఖలు శుక్రవారం(జనవరి 30)తో ముగియనున్నది. గురువారం సాయంత్రం వరకు మొత్తం 7,403 మంది అభ్యర్థులు 7,080 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థులు శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉంది.
శనివారం(జనవరి 31) నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 3వ తేదీ వరకు గడువు ఉంది. ఫిబ్రవరి 11న పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీల్లో 2,582 వార్డులకు, ఏడు కార్పోరేషన్లలోని 414 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి.