
వడోదర: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్లూపిఎల్) సీజన్ 2026లో ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం కొటాంబి స్టేడియంలో యూపి వారియర్స్‌తో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్‌లో బెంగళూరు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో ఛాలెంజర్స్ ఫైనల్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడిన బెంగళూరు ఆరింటిలో జయకేతనం ఎగుర వేసింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన యూపి వారియర్స్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఓపెనర్లు మెగ్ లానింగ్ (41), దీప్తి శర్మ (55) జట్టుకు శుభారంభం అందించారు. అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో యూపి ఆశించిన స్థాయిలో స్కోరును సాధించలేక పోయింది. తర్వాత లక్షఛేదనకు దిగిన బెంగళూరు 13.1 ఓవర్లలోనే కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు గ్రేస్ హారిస్ (75), స్మృతి మంధాన 54 (నాటౌట్)లు విధ్వంసక బ్యాటింగ్‌తో బెంగళూరును గెలిపించారు.