Reading Time: < 1 minute

హైదరాబాద్: సింగరేణి కుంభకోణం నుంచి దృష్టి మళ్లించేందుకు సిట్ నోటీసులు పంపించారని బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. మాజీ సిఎం కెసిఆర్ ను రాజకీయ కక్షతో వేధిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం టివి సీరియళ్లను మించి పోయిందని, సిఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న రాజకీయ కక్షను ఖండిస్తున్నామని డిమాండ్ చేశారు. కెసిఆర్ ను టచ్ చేయడమంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమేనని హరీశ్ రావు సూచించారు. తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపిన మహానేత కెసిఆర్ అని కొనియాడారు. కెసిఆర్ పై బురద చల్లాలని ప్రయత్నించడం సూర్యునిపై ఉమ్మి వేయడమేనని అన్నారు. ప్రజావ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు, రాజకీయ వేధింపులతో మున్సిపాలిటీ ఎన్నికల్లో లబ్ది పొందే కుట్ర అని.. తెలంగాణ సమాజమంతా.. కెసిఆర్ వెంటే ఉందని తెలియజేశారు. రేవంత్ రెడ్డి రాజకీయ వేధింపులకు భయపడే ప్రసక్తే లేదని హరీశ్ రావు పేర్కొన్నారు.