
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాల లో 23 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వికటించింది. ఫుడ్ పాయిజన్ కారణంగా వాంతులు, కడుపు నొప్పితో విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. బుధవారం గ్రామంలోని ఓ శుభకార్యంలో మిగిలిపోయిన పప్పు, కూరలను.. ఈ రోజు మధ్యాహ్న భోజనంలో వడ్డించారని.. వాటిని తినడంవల్ల అస్వస్థతకు గురయ్యామని విద్యార్థులు అధికారులకు ఆరోపించారు. నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఘటన చోటు చేసుకుంది. నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రికి విద్యార్థులను తరలించారు. ఈ విషయంపై విద్యా, వైద్య అధికారులు విచారణ ప్రారంభించారు.