
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సిఎం కెసిఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు. కెసిఆర్ కు నోటీసులు ఇచ్చేందుకు ఎర్రవల్లికి బయలు దేరారు. సాయంత్రంలోగా నోటీసులు ఇవ్వడంతో పాటు రేపు ఫాంహౌస్ లోనే కెసిఆర్ ను ప్రశ్నించే అవకాశం ఉంది. ఇప్పటికే బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, సంతోష్ రావును సిట్ ప్రశ్నించింది. సాయంత్రం లోగా కెసిఆర్ కు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయించింది. కెసిఆర్ కు ఇంటి దగ్గర లేదా ఫాం హౌంస్ లో నోటీసులు ఇవ్వడంపై చర్చ జరగబోతోంది.