Reading Time: < 1 minute

ముంబయి: విమాన ప్రమాదంలో మృతి చెందిన మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. గురువారం మధ్యాహ్నం విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అజిత్ పవార్‌కు అంతిమ సంస్కారాలు చేశారు. ఈ అంత్యక్రియల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మహారాష్ట్ర సిఎం దేవేంద్ర కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అజిత్ పవార్‌ను కడసారి చూసేందుకు ఎన్‌సిపి కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున మైదానం చేరుకున్నారు. జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారానికి వెళ్తుండగా బారామతి విమానాశ్రయం సమీపంలో విమానం కూలడంతో అజిత్ పవార్‌తో మరో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.