Reading Time: < 1 minute

హైదరాబాద్: సిఎం, మంత్రుల ప్రమేయం లేకుండా ట్యాపింగ్ జరగదని టిపిసిసి చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. మాజీ సిఎం కెసిఆర్ కు నోటీసులు ఇవ్వడంలో రాజకీయ దురుద్దేశం లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ లో ఎవరు భాగస్వాములో తేలాల్సి ఉందని, 500కు పైగా ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారని సమాచారం ఉందని తెలియజేశారు. వాస్తవాలు తెలుసుకునేందుకు సిట్ ఎవరికైనా నోటీసులు ఇవ్వొచ్చునని, సమగ్ర దర్యాప్తు జరిగితేనే నిజాలు బయటకు వస్తాయని మహేష్ గౌడ్ పేర్కొన్నారు.