Reading Time: < 1 minute

వర్సటైల్ హీరో దుల్కర్ సల్మాన్ ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ’ఆకాశంలో ఒక తార’తో అలరించబోతున్నారు. విలక్షణ కథలతో ఆకట్టుకునే పవన్ సాదినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రతిష్టాత్మక గీతా ఆర్ట్, స్వప్న సినిమా సమర్పణలో ఈ చిత్రాన్ని సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మిస్తున్నారు. దుల్కర్ సరసన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తోంది. తాజాగా చిత్ర బృందం ఒక సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఈ మధ్య కాలంలో ఆచితూచి సినిమాలు చేస్తున్న శృతి హాసన్, ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, టీం ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఆమె కళ్ళకు అద్దాలు పెట్టుకుని ఇంటెన్స్ లుక్ లో కనిపించడం ఆకట్టుకుంది. కథలో శ్రుతి హాసన్ పాత్ర కీలక మలుపుగా నిలవనుంది. ప్రస్తుతం నిర్మాణ చివరి దశలో ఉన్న ’ఆకాశంలో ఒక తార’ చిత్రం 2026 వేసవిలో తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషలలో పాన్-ఇండియా స్థాయిలో విడుదల కానుంది.