
దీక్షిత్ శెట్టి, క్రితికా సింగ్ ప్రధాన పాత్రల్లో ప్రేమ్ చంద్ కిలారు తెరకెక్కించిన చిత్రం ‘శబార’. విశ్రమ్ ఫిల్మ్ ఫ్రాటర్నిటీ బ్యానర్ మీద హర్షిత చదలవాడ, దుర్గా చుంచు, రమాదేవి కిలారు నిర్మించిన ఈ మూవీకి సంబంధించిన ప్రపంచాన్ని ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ ద్వారా పరిచయం చేశారు. మిథున్ ముకుందన్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు. ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ అంటూ నిర్వహించిన కార్యక్రమంలో దీక్షిత్ శెట్టి మాట్లాడుతూ .. “అందరికీ ‘హార్ట్ బీట్ ఆఫ్ శబార’ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. శబార అంటే ప్రపంచం.. ప్రేమ్ చంద్ సృష్టించిన ప్రపంచమిది. అడవిలోనే మొత్తం కథ జరుగుతుంది”అని అన్నారు. దర్శకుడు ప్రేమ్ చంద్ కిలారు మాట్లాడుతూ .. “హార్ట్ బీట్ ఆఫ్ ‘శబార’కి మంచి స్పందనను ఇచ్చారు. చిత్రీకరణ ఇంకా పూర్తి కాలేదు. త్వరలోనే ఆడియెన్స్ ముందుకు వస్తాం”అని తెలిపారు. క్రితికా సింగ్ మాట్లాడుతూ ప్రేమ్ చంద్ లేకపోతే ‘శబార’ ఇంత గొప్పగా వచ్చేది కాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మీషా నారంగ్, రాజీవ్ పిళ్లై, భూషణ్ కళ్యాణ్, సుమాయా, శివ కామేష్, మోహన్ భగత్, మిథున్ ముకుందన్ పాల్గొన్నారు.