Reading Time: < 1 minute

న్యూయార్క్: ముఖ్యమంత్రి రేవంత్ అమెరికా పర్యటనలో ఉన్నారు. హార్వర్డ్ యూనివర్సిటీలోని కెన్నెడీ స్కూల్‌లో విద్యార్థులు, ప్రొఫెసర్లతో సమావేశామయ్యారు. విద్యా ప్రమాణాల పెంపుపై చర్చలు జరిపారు. తెలంగాణ అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ విజన్ తీసుకోచ్చామని వివరించారు. విద్యారంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సిఎం కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ తెలిపారు. తెలంగాణలో విద్యా ప్రమాణాలు పెంచడంతో పాటు విద్యా విధానాలు, ప్రక్రియలపై భేటీలో ప్రధానంగా చర్చించారు. ఆధునిక నైపుణ్యాభివృద్ధి, ఆర్థిక వృద్ధిలో మానవ వనరుల అభివృద్ధి పాత్ర వంటి అంశాలపై కూడా సుదీర్ఘంగా ప్రొఫెసర్లతో చర్చలు జరిపారు.