
హైదరాబాద్: విశాఖపట్నంలో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన నాలుగో టి20లో టీమిండియా ఓటమిని చవిచూసింది. భారత జట్టుపై కివీస్ 50 పరుగుల తేడాతో గెలిచింది. న్యూజిలాండ్ తొలుత బ్యాటింగ్ చేసి భారత జట్టు ముందు 216 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. భారత జట్టు 18.4 ఓవర్లలో 165 పరుగులకే ఆలటౌంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు ఫుల్‌టైమ్ బౌలర్లతో బరిలోకి దిగింది. దీనిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. 180 నుంచి 200 పరుగులు ఛేదిస్తున్నప్పుడు తొలి మూడు వికెట్లు త్వరగా పడిపోతే మిగిలిన బ్యాట్స్‌మెన్లు ఒత్తిడికి లోనవుతారని తెలిపారు. అందుకే ఆరుగురు బ్యాటర్లు, ఐదుగురు బౌలర్ల కాంబినేషన్‌తో బరిలోకి దిగామని వివరించారు. తమను తామే ఛాలెంజ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నామని, వరల్డ్ కప్‌లో కూడా ఇదే జట్టుతో ఆడుతామని చెప్పారు. తొలుత తాము బ్యాటింగ్ చేసిన సందర్భాల్లో చక్కగా తమ బాధ్యత నిర్వర్తించామన్నారు. ఛేదనలో తమను తాము పరీకించుకోవడంతో పాటు మళ్లీ ఒకసారి ఛేదనలో విజయం సాధిస్తామి ధీమా వ్యక్తం చేశారు. మ్యాచ్‌లో శివమ్ దూబే శివ తాండవం చేశారు. దూబే 23 బంతుల్లో 65 పరుగులు చేసి రనౌట్ రూపంలో ఔటయ్యాడు. మ్యాట్ హెన్రీ బౌలర్ చేతికి బంతి తగిలి వికెట్లకు తగలడంతో దూబె ఔటయ్యాడు.