
మన తెలంగాణ / హైదరాబాద్ : ఆసియా ఖండం లోనే అతి పెద్ద గిరిజన జాతర, తెలంగాణ రాష్ట్ర కుంభమేళా గా ప్రసిద్ధి చెందిన మేడారం లో వెలసిన సమ్మక్క, సారక్క పండుగ ను కేంద్రం ప్రభుత్వం తక్షణమే జాతీయ పండుగ గా ప్రకటించాలని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ కేంద్ర ప్రభుత్వన్ని డిమాండ్ చేశారు. మేడారం లో వెలసిన వన దేవతలు సమ్మక్క సారలమ్మ లను యాబై మంది బిసి కులాల రాష్ట్ర అధ్యక్షుల తో కలిసీ జాజుల దర్శించుకున్నట్లు వెల్లడించారు. సమ్మక్క సారలమ్మ ల జీవిత చరిత్రను బౌవిష్యత్ తరాలకు చేర్చడానికి పాఠ్య పుస్తకాల్లో చేర్చడంతో పాటు మొత్తంగా గ్రంథస్తం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కొత్తగూడెం జిల్లాకు భద్రాద్రి జిల్లా, భువనగిరి జిల్లాకు యాదాద్రి జిల్లా , గద్వాల జిల్లాకు జోగులాంబ జిల్లా అని పేరు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మ పేరు ఎందుకు పెట్టడం లేదని తక్షణమే ములుగు జిల్లాకు సమ్మక్క సారలమ్మల జిల్లాగా పేరు పెట్టాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. కోట్లాదిమంది తరలివచ్చే మేడారం జాతర ఏర్పాట్లు దగ్గరుండి చూసుకుంటున్న సమ్మక్క సారమ్మల వారసురాలు మంత్రి సీతక్కకు జాజుల శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.